Taliban Block Afghans: అప్ఘాన్లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్న తాలిబన్లు

అప్ఘానిస్తాన్ దేశం వదిలి వెళ్లిపోతున్న అప్ఘాన్లను తాలిబన్లు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవడం కష్టంగా మారింది.

Taliban Blocking Afghans From Airport Reports

Taliban block Afghans : అప్ఘానిస్తాన్ దేశం వదిలి వెళ్లిపోతున్న అప్ఘాన్లను తాలిబన్లు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. దేశం దాటివెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అఫ్ఘాన్ ప్రజలకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవడం కష్టంగా మారింది. దాదాపు 4,500 మంది అమెరికా సైనికులు విమానాశ్రయాన్ని నియంత్రిస్తున్నారు. అయితే టెర్మినల్స్‌కు వెళ్లే రహదారులన్నీ తాలిబాన్ల నియంత్రణలో ఉన్నాయి. ప్రయాణ పత్రాలు లేని అప్ఘాన్లను విమానాశ్రయానికి చేరుకోవడానికి తాలిబాన్లు అనుమతించడం లేదని సమాచారం. తాలిబన్లు ఇచ్చిన హామీలను ఉల్లంఘించంతో అప్ఘాన్లు ప్రాణభయంతో దేశం వదిలివెళ్లిపోతున్నారు.

అమెరికా నియంత్రణలో ఉన్న విమానాశ్రయం గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మార్గం తాలిబన్ల నియంత్రణలో ఉండటంతో విమానాశ్రయానికి చేరుకోవడంలో అప్ఘాన్ శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాలిబాన్ ఆక్రమణ తర్వాత వేలాది మంది అప్ఘాన్ ప్రజలు దేశం విడిచి పారిపోవడానికి విమానాశ్రయానికి భారీగా చేరుకుంటున్నారు. విమానాశ్రయ టెర్మనల్స్ వద్దకు చేరుకున్న కొంతమందికి లోపలికి ప్రవేశించడం సవాలుగా మారింది. అన్ని చోట్ల తాలిబాన్ చెక్‌పోస్టులను నియంత్రణలోకి తీసుకున్నారు. దాంతో అప్ఘాన్ శరణార్థులు విమానాశ్రయానికి చేరుకోలేకపోతున్నారు. గత వారంలో వందలాది మంది శరణార్థులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ స్వాధీనం చేసుకోవడంతో సరిహద్దులను పాకిస్తాన్ అధికారులు వెంటనే మూసివేశారు.
Afghanistan : అప్ఘాన్‌‌లో తాలిబన్లు, భారత్‌‌పై ఎఫెక్ట్..వీటి ధరలు పెరుగుతాయా ?

ప్రస్తుతం ఈ సరిహద్దులను వాణిజ్యం అవసరాల కోసం మాత్రమే తెరిచి ఉంచారు. అప్ఘానిస్తాన్ వైపు నుంచి వ్యాపారులను మాత్రం ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతినిస్తున్నారు. ఇతరులను ఎవరిని కూడా అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు పాకిస్తాన్ నెలరోజులుగా ఈ సరిహద్దులో కంచె వేస్తోంది. ఎక్కువ మంది ఆఫ్ఘన్ శరణార్థులను చేర్చుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పేసింది. అఫ్ఘనిస్తాన్‌లో తమ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను చెదరగొట్టడానికి తాలిబాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులను దారుణంగా చంపేశారు.

అనేక మంది కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు.. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లకుండా అప్ఘాన్ ప్రజలను అడ్డుకుంటున్నారు. అఫ్ఘాన్ నుంచి శరణార్థుల తరలింపులో సాయం చేసేందుకు దేశీయ విమానయాన సంస్థలను అమెరికా ఆమోదించింది. యుఎస్ దేశీయ విమానయాన సంస్థలు, పౌర పైలట్లలో కాబూల్‌లోకి వెళ్లడానికి అనుమతించినట్టు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. అయితే వారికి అమెరికా రక్షణ శాఖ నుంచి ముందస్తు అనుమతి ఉండాలి. ప్రస్తుతం, అనుమతి లేకుండా అఫ్ఘనిస్తాన్ గగనతలం లేదా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లకుండా నిషేధం విధించారు. వైట్ హౌస్ ప్రకారం.. ఆగస్టు 14 నుంచి యునైటెడ్ స్టేట్స్ 6వేళ మందిని తరలించింది.
Afghan Reserves : తాలిబన్ కి బైడెన్ బిగ్ షాక్..వేల కోట్ల అప్ఘాన్ నిధులు ఫ్రీజ్