Afghan : కుటుంబం ఎదుటే గర్భవతి మహిళా పోలీసును కాల్చి చంపారు

గర్భవతి అయిన పోలీసును ఆమె కుటుంబం ఎదుటే కాల్చి చంపారు. ఈ విషయాన్ని అప్ఘన్ జర్నలిస్టు ట్వీట్ లో వెల్లడించారు.

Afghan

Taliban Kills : అప్ఘానిస్తాన్ లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. దారుణాలకు తెగబడుతున్నారు. వ్యతిరేకించే వారిని పిట్టల్లా కాల్చిపారేస్తున్నారు. దీంతో అక్కడ ఉండేందుకు చాలా మంది భయపడుతున్నారు. మొత్తం అప్ఘానిస్తాన్ ను తాలిబన్లు వశం చేసుకున్నారు. తాజాగా… గర్భవతి అయిన పోలీసును ఆమె కుటుంబం ఎదుటే కాల్చి చంపారు. ఈ విషయాన్ని అప్ఘన్ జర్నలిస్టు ట్వీట్ లో వెల్లడించారు.

Read More : Panjshir : పంజ్‌షీర్‌ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు!

నిగారా మహిళ ఆరు నెలల గర్భవతి. ఈమె పోలీసు శాఖలో పని చేస్తోంది. ఆమె భర్త, పిల్లల ముందు కాల్చి చంపినట్లు జర్నలిస్టు వెల్లడించారు. మహిళలు బుర్ఖాలు లేకుండా..కనిపిస్తే…తాలిబన్లు వేటాడుతారు..కొడతారు అనే భయంతో…వాటిని కొనుగోలు చేస్తున్నారు. తాలిబన్లు అప్ఘాన్ ను వశం చేసుకున్న తర్వాత..అక్కడ ఆందోళనలు మిన్నంటాయి.

Read More : Taliban : పంజ్‌షీర్‌‌ ఆక్రమణకు తాలిబన్లతో చేతులు కలిపిన అల్‌ఖైదా

ప్రధానంగా..మహిళలు రోడ్డు మీదకు వచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేప్టారు. దేశ రాజకీయ వ్యవస్థ నుంచి మహిళలను మినహాయించడాన్న వ్యతిరేకిస్తూ…నినాదాలతో హోరెత్తించారు. హెరాత్ లో ఇలాగే నిరసన ప్రదర్శనలు చేసిన అనంతరం అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. అప్ఘాన్ లో మహిళల భవిష్యత్ విషయంలో సర్వత్రా ఆందోళన నెలకొంది.

Read More :Taliban : తాలిబన్ల వల్లే పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి… బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

మరోవైపు…ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు కసరత్తు, ప్రమాణ స్వీకారానికి రండిపంజ్‌షిర్‌లో జెండా పాతిన తాలిబన్లు…అప్ఘానిస్తాన్ మొత్తం తమ ఆధీనంలోకి రావడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ దేశాలకు ఆహ్వానం పంపారు. అఫ్ఘాన్‌ స్వాధీనానికి తాలిబన్లకు సాయం చేసిన పాక్‌తో పాటు చైనా, రష్యా, టర్కీ, ఖతార్‌లను ఆహ్వానించారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలి.. మంత్రివర్గంలో ఎవరుండాలి…వంటి అంశాలపై తుది దశ చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్ అగ్రనేతలు.