Taliban : తాలిబన్ కొత్త ప్రభుత్వం : కాబూల్ గవర్నర్, మేయర్‌ సహా ఏడుగురి పేర్లు ప్రకటన!

అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తమ ప్రభుత్వంలో అధికారులు ఏయే పదవులు చేపట్టనున్నారో ప్రకటించింది.

Taliban name Kabul governor, mayor : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తమ ప్రభుత్వంలో అధికారులు ఏయే పదవులు చేపట్టనున్నారో ప్రకటించింది. ఇప్పటివరకూ మొత్తం ఏడుగురు పేర్లను వెల్లడించింది. అందులో కాబూల్‌ గవర్నర్‌, మేయర్‌తోపాటు ఏడు ప్రభుత్వ అధికారుల పేర్లను తాలిబన్ ప్రకటించింది. ఈ మేరకు అప్ఘానిస్తాన్ న్యూస్ ఏజెన్సీ Pajhwok Afghan న్యూస్ నివేదించింది.

తాలిబన్ ప్రభుత్వం కొత్త అధికారుల నియామకాల్లో కాబూల్ కొత్త గవర్నర్‌గా ముల్లా షిరిన్ (Mullah Shirin), కాబూల్‌ మేయర్‌గా హమ్దుల్లా నోమాని (Hamdullah Nomai), విద్యాశాఖ అధిపతిగా సఖౌల్లా (Sakhaullah), యాక్టింగ్‌ అంతర్గత మంత్రిగా సదర్ ఇబ్రహీం (Sadr Ibrahim), ఉన్నత విద్య అధిపతిగా అబ్దుల్ బాకీ (Abdul Baqi), ఆర్థిక మంత్రిగా గుల్ అఘా (Gul Agha), అఫ్ఘానిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నజీబుల్లా (Najibullah) నియమితులయ్యారు.
Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?

ఇప్పటికే తాలిబన్ ద ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాంక్‌ (DAB) యాక్టింగ్‌ హెడ్‌గా హాబీ మహ్మద్ ఇద్రిస్‌ (Haji Mohammad Idris)ను నియమిస్తున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్‌ చేశారు. అప్ఘాన్ ప్రజలు ఎదుర్కొంటున్నబ్యాంకు సంబంధిత సమస్యలను ఆయన పరిష్కరిస్తారని తెలిపారు.

అఫ్ఘాన్‌లో అమెరికా దళాల ఉపంసంహరణ గడువు ఆగస్ట్‌ 31వరకు మాత్రమే ఉంది. ఈలోగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్‌ సన్నద్ధమవుతోంది. గడువు తేదీ ముగిసే నాటికి అమెరికా బలగాలను వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు