Taliban Rule
Taliban Rule: అఫ్ఘానిస్తాన్ లో కొత్త రూల్ తీసుకొచ్చారు తాలిబాన్లు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే ముందుగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, జస్టిస్ డిపార్ట్‌మెంట్లకు సమాచారం ఇచ్చినాకే ఆందోళన చేసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అఫ్ఘానిస్తాన్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. 24గంటల ముందే అనుమతి కోసం రిక్వెస్ట్ చేయాలట.
తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ కు సపోర్ట్ గా అఫ్ఘానిస్తాన్ లో పలు చోట్ల మంగళవారం ఆందోళనలు జరిగాయి. బల్క్ ప్రాంతంలో మహిళలు సమూహంగా ఏర్పడి వారి డిమాండ్‌లను నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి కొత్త అఫ్ఘాన్ ప్రభుత్వంతో నాశనమైపోతుందంటూ చెప్పుకొచ్చారు. కాబూల్, బదక్షాన్, పర్వాన్ ప్రాంతాల్లోనూ నిరసనలు జరిగాయి.
ఆగష్టులో అఫ్ఘానిస్తాన్ పై దాడులు జరిపిన తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. స్థానికులు తాలిబాన్ల గత పాలనా తీరును గుర్తుంచుకుని భయాందోళనలతో అఫ్ఘాన్ వదిలిపోయే ప్రయత్నాలు చేశారు. వేల మంది తరలిపోగా.. ఇంకొందరు చేస్తున్న ప్రయాణాలను అడ్డుకున్నారు తాలిబాన్లు. ఎయిర్ పోర్టును మూసేసి రాకపోకలను అడ్డుకున్నారు.
మహిళలకు హక్కులు కల్పిస్తాం. వారిని గౌరవిస్తాం అని చెప్తూనే.. హింసలకు పాల్పడుతున్నారు.