Attack on Kili Paul: భారతీయ సినీ పాటలకు డాన్స్ వేసే కిలి పాల్ పై దుండగులు కత్తితో దాడి

టాంజానియాకు చెందిన సోషల్ మీడియా స్టార్..కిలి పాల్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన కిలి పాల్ గురించి సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

Attack on Kili Paul: టాంజానియాకు చెందిన సోషల్ మీడియా స్టార్..కిలి పాల్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన కిలి పాల్ గురించి సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాంజానియాకు చెందిన కిలి పాల్..కరోనా లాక్ డౌన్ సమయంలో..భారతీయ సినీ పాటలకు నృత్యాలు చేస్తూ..వాటిని టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవాడు. ఆ పాటల్లో హీరోలు చేసే డాన్సులను అచ్చుగుద్దినట్లు వేసేవాడు. తన నృత్యాలు, హావభావాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు కిలి పాల్. ముఖ్యంగా భారతీయలు కిలి పాల్ నృత్యాలకు ఫిదా అయ్యారు. భారతీయ సినీ పాటలతో నృత్యాలు చేస్తూ..ఆ చిత్రాలకు ప్రపంచ స్థాయి ఆదరణ తెస్తున్నాడంటూ టాంజానియాలోని భారత రాయబార కార్యాలయం అతన్ని ఘనంగా సత్కరించింది.

Also read:Xiaomi : షావోమీకి షాక్ ఇచ్చిన ఈడీ.. ఎందుకో తెలుసా

కాగా, ఇటీవల ఇంటి వద్ద ఉన్న తనపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు కత్తులు కర్రలతో దాడి చేశారని కిలి పాల్ తెలిపాడు. దుండగుల దాడి సమయంలో తనను తాను రక్షించుకున్నాని..ఇద్దరిపై తిరిగి దాడి చేయడంతో ఆ ఐదుగురు అక్కడి నుంచి పరారయ్యారని కిలి పాల్ చెప్పుకొచ్చాడు. తనను తాను రక్షించుకునే సమయంలో దుండగులు తనపై కత్తితో దాడి చేయడంతో ఐదు కుట్లు పడ్డాయని..అయితే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డానని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కిలి పాల్ చెప్పుకొచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లో కిలి పాల్ కు 36 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. కిలి పాల్ సోదరి నీమ పాల్ కూడా సోషల్ మీడియాలో ఆదరణ పొందుతున్నారు.

Also read:Woman Cat Marriage: ఇదేం విడ్డూరం: పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ

ట్రెండింగ్ వార్తలు