Taylor Swift
Taylor Swift : తమ అభిమాన నటీనటుల్ని చూడాలని, కలవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. వాళ్ల కోసం సంఘాలు ఏర్పాటు చేసుకుని సోషల్ సర్వీస్ చేసే వారుంటారు. అలాగే ఓ సింగర్ పట్ల కొందరు అభిమానులు తమ అభిమానాన్ని ఎలా చాటుకున్నారంటే? చదవండి.
Anchor Suma : పోలీసులతో గొడవ పెట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. వీడియో వైరల్..
సినిమా స్టార్లు, క్రికెటర్లు, సింగర్లు ఇలా ఏ రంగంలో వారైనా తాము ఇష్టపడేవారి కోసం అభిమానులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొందరు గుడి కట్టి అభిమానం చాటుకుంటే.. కొందరు అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. మరి కొందరు తాము అభిమానించే సెలబ్రిటీ కోసం, వారి దృష్టిలో పడటం కోసం వెరైటీ పనులు చేస్తుంటారు. అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కోసం కొందరు అభిమానులు ఏం చేశారంటే? ఒకటి కాదు రెండు కాదు 3,347 మంది అభిమానుల ఫోటోలు ఉపయోగించి ఆమె అద్భుతమైన డిజిటల్ పోర్ట్రైయిట్‌ను రూపొందించారు.
Devara : ఎన్టీఆర్ ‘దేవర’ ఆ కుర్రాడి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ అబ్బాయి ఎవరో తెలుసా..?
3,347 ఫోటోలతో రూపొందించిన టేలర్ స్విఫ్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @stitchswift13 ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఒక్కో ఫోటోను అమర్చి టేలర్ స్విఫ్ట్ రూపం తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఔరా అనిపించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉండే టేలర్ స్విఫ్ట్ ఇంకా ఈ ఫోటోపై స్పందించలేదు. ఆమె రిప్లై కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు టేలర్ స్విఫ్ట్ ఫోటోను ‘అద్భుతం’ అంటూ కొనియాడారు.
3347 photos of Taylor Alison Swift pic.twitter.com/I9diO7eu5Q
— ? & ? ?? (@stitchswift13) November 16, 2023