Teacher John Corcoran: చదవడం,రాయడం రాదు..కానీ టీచర్​ ఉద్యోగం చేసి 48ఏళ్లకు అక్షరాలు దిద్దిన మాస్టారు

చదవటం రాదు..రాయటం రాదు. కానీ 17ఏళ్లు ఉద్యోగం చేశారు ఆ మాస్టారు.48 ఏళ్లకు అక్షరాలు దిద్దారు. గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పేరొందిన .ద గ్రేట్ మాస్టారు ఇంట్రెస్టింగ్ స్టోరీ..

teacher John Corcoran who couldn’t read,Writing : ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు పాఠాలు చెప్పటమే కాదు..బోర్డుపై రాయాలి. పుస్తకాల్లో ఉన్నది చదివి పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. కానీ ఓ మాస్టారికి అస్సలు చదవటమే రాదు..రాయటం అంతకంటే రాదు. కానీ స్కూల్లో ఉపాధ్యాయుడు ఉద్యోగం చేశారు. అది కూడా గత 17 ఏళ్లు. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజమే. మరి అంతకాలం సదరు టీచర్ చదవటంకాకుండా రాయటం రాకుండా ఎలా నెట్టుకొచ్చారు? ఎలా ఈ విషయంలో దొరికిపోయిన ఆ మాస్టారి పేరు జాన్ కర్కోరాన్. అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నవ్యక్తి.

జాన్ కర్కోరాన్ అమెరికాలో 1939లో పుట్టారు. అతనికి ఆరుగురు తోబుట్టువులు. జాన్ చిన్నప్పుడు డిస్లెక్సియా అనే రుగ్మతతో బాధపడేవారు. తల్లిదండ్రులు జాన్​ వ్యాధిని గుర్తించడంలో అశ్రద్ధ చేశారు. దీంతో అతనికి చదవడం, రాయడం వచ్చేది కాదు. కానీ జాన్ కు టీచర్ అవ్వాలని చిన్ననాటి నుంచి కోరిక. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ఎంతో ఇష్టం.

అలా టీచర్ కావాలంటే చదవాలి. రాయాలి. కానీ తనకు ఈ రెండూ రావు. కానీ టీచర్ అవ్వాలనే కోరిక మాత్రం ఉంది. అందుకే డిఫరెంట్ గా ఆలోచించారు జాన్. తనలో ఉన్నలోపం తన లక్ష్యానికి అడ్డుకాకుండా ఉండటానికి ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించేవారు.అలా ఏదో సాధించాలన్న పట్టుదలే జాన్ ను క్రీడల వైపు ఆసక్తి పెంచుకునేలా చేసింది. అలా రాష్ట్ర స్థాయిలో ఫుట్​బాల్ ఛాంపియన్ అయ్యారు. స్పోర్డ్స్ కోటాలో అయినా టీచర్ కావాలని.

పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కావాలనే చేతులకు దెబ్బలు తగిలించుకునేవారు. మరో వ్యక్తి సహాయంతో పరీక్షలు రాసేవారు. కొన్ని సార్లు చీటింగ్ చేసేవారు. మరికొన్ని సార్లు డబ్బులిచ్చి పాస్ అయ్యేవారు. అలా అలా డిగ్రీ వరకు ఎలాగోలా నానా అవస్థలు పడి కొత్త కొత్త చీటింగ్ లతో నెట్టుకొచ్చారు మన జాన్​. డిగ్రీ అంటే అది మామూలు డిగ్రీ కాదు సుమా.. బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​లోనే డిగ్రీ పాస్​ అయ్యారు జాన్​.

డిగ్రీ పట్టా చేతికొచ్చింది. ఉద్యోగ వేటలోనూ పడ్డారు. చివరికి స్పోర్ట్స్ కోటాలో కష్టపడకుండానే జాన్ కు హైస్కూల్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఎంతో సంబరపడిపోయారు తన చిరకాల కోరిక తీరబోతున్నందుకు.  అదేసమయంలో ఆందోళన పడ్డారు. తనకు చదవడం,రాయడంరాదు కదా..! అందుకే అది కప్పి పుచ్చుకోవటానికి ఇక్కడ కూడా జిమ్మిక్కులు చేసేవారు. విద్యార్థులకు ఓరల్ టెస్టులు పెట్టేవారు. వారికి తనకున్న చక్కటి వాగ్దాటితో టీచింగ్ ఇచ్చేవారు. బోర్డుపై ఏదైనా రాయాల్సి వస్తుంది కదా. మరి అప్పడెలా మ్యానేజ్ చేశాడంటే. ఆ పని చేయడం కోసం ఒక జూనియర్ అసిస్టెంట్​ని పెట్టుకున్నారు. అతనికి ఏం రాయాలో ముందే ట్రైనింగ్ ఇచ్చి..అతనితో బోర్డుపై రాయించేవారు.

ఇలా ప్రతిరోజు జాన్​ కార్కోరాన్​ అలాగే చేసేవారు. అలా ఒకటీ రెండు కాదు ఏకంగా 17 సంవత్సరాలు మ్యానేజ్ చేశారు పుస్తకం చదవకుండా..బోర్డుమీద రాయకుండా. కానీ పిల్లలకు అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా కోచింగ్ ఇవ్వటంతో మన జాన్ కర్కోరాన్ దిట. దీంతో జాన్ శిక్షణలో ఎందరో గొప్ప విద్యార్థులు తయారయ్యారు.

ఇన్ని తెలివితేటలతో మ్యానేజ్ చేసిన జాన్ గుట్టు ఎలా బయటపడిందంటే..అదేదో ఆయన్ని ఎవ్వరూ పట్టుకోలేదు. గుర్తించలేదు.అదీకూడా 17 ఏళ్లు గడిచాక. ఒక రోజు తనకు తాను చేస్తున్న పని సరైనది కాదు అని జాన్ కే అనిపించింది. అందుకే తన జీవితంలో అతి గొప్ప రహస్యాన్ని..ఎవ్వరూ గుర్తించని రహస్యాన్ని జాన్​ తనకు తానే బయటపెట్టాడు. అంతే..టీచర్​ ఉద్యోగం కూడా వదులుకున్నారాయన. 50 ఏళ్లకు చేరువలో ఉన్న జాన్ మళ్లీ A,B,C,D లు దిద్దడం ప్రారంభించారు. అలా అతని పట్టుదలతో 5 ఏళ్లలో ఒక పుస్తకం రాయగలిగే స్థాయికి చేరుకున్నారు. చదవటం రాయటం రాని టీచర్ జాన్ కథ విన్న అందరూ షాక్ అయ్యారు. ఎంతగానో ఆశ్చర్యపోయారు.

కానీ అదే జాన్ తర్వాతి కాలంలో గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కితాబునందుకున్నారు. జాన్​ తన పేరుమీద ఓ ఫౌండేషన్​ ప్రారంభించారు. అదే జాన్​ కార్కోరన్​ ఫౌండేషన్​. చదవడం, రాయడం రాకుండా 17 సంవత్సరాలు జాన్ ఉపాధ్యాయుడిగా ఎలా సేవలు అందించాడన్నది ఇప్పటికీ ఎందరో మేధావులకు సైతం అర్ధం కానీ నిగూఢ రహస్యమనడంలో సందేహం లేదు.అది టీచర్ వృత్తిపట్ల ఆయనకున్న అమితమైన ఇష్టం.గౌరవం.ఆ గౌరవంతోనే తనకు తానుగానే ఉద్యోగం మానేయటం.

ప్రస్తుతం జాన్ వయస్సు 82 ఏళ్లు.1986లో వయోజన విద్య గురించి టీవీలో చెబుతుంటే విని చదవటం రాయటం నేర్చుకున్నారు జాన్. 1997 లో జాన్ కోర్కోరన్ ఫౌండేషన్‌ను ప్రారంభించడానికి ముందు 1994 లో తన అనుభవాల గురించి తన మొదటి పుస్తకాన్ని వ్రాసారు.

ట్రెండింగ్ వార్తలు