హలో! మీరు చావబోతున్నారు:ఆక్సిజన్ మాస్క్ తీసేయండి

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 07:19 AM IST
హలో! మీరు చావబోతున్నారు:ఆక్సిజన్ మాస్క్ తీసేయండి

‘మీరు.. ఎక్కువ కాలం బతకరు!’ అని డాక్టర్‌.పేషెంట్‌ మొహంమీదే చెపితే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది..ఒక్కసారి ఊహించుకోండి..గుండె అప్పుడే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది కదూ..కాలిఫోర్నియాలో అదే జరిగింది. ఓ డాక్టర్ తన పేషెంట్ కు వీడియో కాల్ చేసి చెప్పారు. ఆ మరునాడే ఆ వ్యక్తి చనిపోయారు. ఎర్నెస్ట్ క్వింటానా అనే 72 సంవత్సరాల వ్యక్తి కాలిఫోర్నియాలోని కైసర్ పర్మినెంట్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్‌కు చెందిన రోబో స్క్రీన్‌పై ఎర్నెస్ట్‌కు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రత్యక్షమై.. ‘మీరు కొన్ని రోజుల్లో చనిపోతారు!’ అంటు చావు కబురు చల్లగా చెప్పారు. 

”మీ ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని..రెస్ట్ తీసుకోవడం తప్ప..వేరే దారి లేదన్నారు. ‘ఇక మీరు ఆక్సిజన్ మాస్క్ తీసేసి, సొంతంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. చనిపోయేవరకూ ఆ మార్ఫిన్ (మత్తు మందు)ను అలానే వాడండి..’అని చెప్పారుడాక్టర్.. అని..ఆ రోబో ఫోటోను ఎర్నెస్ట్ కుమార్తె ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.”వైద్యం, టెక్నాలజీ కలయిక ఎంతటి దుర్మార్గానికి దారితీసిందో చూడండి..ట్రీట్ మెంట్ లో టెక్నాలజీ డెవలప్ మెంట్ అద్భుతం. కానీ..దాని లిమిట్ ఎంతవరకు ఉండాలి అన్నదానిపై స్పృహ ఉండాలని నేను భావిస్తున్నా” అన్నారు. ఎర్నెస్ట్ కుటుంబ మిత్రులొకరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..పేషెంట్‌తో ఇలా వ్యవహరించడం భావ్యం కాదన్నారు.
 

ఎర్నెస్ట్ విషయంలో జరిగినదానికి పశ్చాత్తాప పడుతున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. రోబో తెరపై డాక్టర్ ఈ విషయాన్ని చెబుతున్నపుడు అక్కడేవున్న ఎర్నెస్ట్ మనవరాలు ఆ సమయంలో తన మానసిక పరిస్థితిని తెలుపుతు..ఆ గదిలో నేను, తాతయ్య మాత్రమే ఉన్నామనీ..నేను ఏడవకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించా’నన్నారు. ఈ విషయమై ఎర్నెస్ట్ భార్య హాస్పిటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 
 

దీనిపై స్పందించిన మెడికల్ సెంటర్‌ ఎర్నెస్ట్ మరణానికి చింతిస్తున్నామనీ..డాక్టర్, పేషెంట్ మధ్య ఉండే మానవ సంబంధాల స్థానంలో టెక్నాలజీని వాడాలని మా ఉద్దేశం కాదనీ..ఎర్నెస్ట్ కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలమనీ..ఈ సంఘటన ద్వారా, టెలీ-వీడియో వినియోగం విషయంలో ఆలోచిస్తామని తెలిపిలింది.