Benjamin Button Disease : 18ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు.. 2కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో టీనేజర్ మృతి

హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా... ఇది ఒక అరుదైన సిండ్రోమ్. 2 కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. టీనేజ్ లోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది.

Benjamin Button Disease : 18ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు.. 2కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో టీనేజర్ మృతి

Benjamin Button Disease

Updated On : July 25, 2021 / 3:27 PM IST

Benjamin Button Disease : హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా… ఇది ఒక అరుదైన సిండ్రోమ్. 2 కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. టీనేజ్ లోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. బ్రిటన్ కు చెందిన అషాంటీ స్మిత్(18) అనే అమ్మాయి కూడా ఈ హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడుతూ చనిపోయింది. ఈ సిండ్రోమ్ ను Benjamin Button డిసీజ్ అని కూడా పిలుస్తారు.

అషాంటీ 8వ ఏట ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు కనిపించేవి. 18 ఏళ్ల వయసులో అందరినీ విషాదంలో ముంచెత్తుతూ కన్నుమూసింది. అప్పటికే తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి.

Ashanti

తాను చనిపోయేంత వరకు తనలోని విషాదాన్ని మౌనంగా భరిస్తూ, అందరినీ నవ్వించేది. పైగా, తాను త్వరలోనే చనిపోతానని తెలిసి కూడా ఆమె ముఖంపై నవ్వు చెరగలేనదని తల్లి లూయిస్ స్మిత్ వెల్లడించింది. ఆమె బీటీఎస్ సంగీతానికి అభిమాని అని, ఆమె అంత్యక్రియల్లో బీటీఎస్ సంగీతం వినిపిస్తామంది. తమ కుమార్తె జ్ఞాపకార్థం హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని లూయిస్ స్మిత్ వివరించింది.

Ashanti

అషాంటీ స్మిత్ ఇటీవలే తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే మృత్యువాత పడింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అరుదైన వ్యాధికా కారణంగా అషాంటీ స్మిత్ 144 ఏళ్ల వయసున్న వృద్ధురాలిలా కనిపించేది. చూడటానికి చాలా భయానకంగా ఉండేది. తన కూతురు చాలా బ్రిలియంట్ అని తల్లి లూయిస్ స్మిత్ చెబుతుంది. అంతేకాదు చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అంటుంది. అరుదైన వ్యాధి కారణంగా అషాంటీ స్మిత్ అస్సలు నడవలేకపోయేదని తల్లి చెప్పింది. అయితే తన కూతురి హృదయాన్ని, విల్ పవర్ ను, సంకల్పాన్ని మాత్రం ఆ వ్యాధి ఏమీ చేయలేకపోయిందని చెప్పింది. ప్రతి ఒక్కరు నా కూతురిని ప్రేమించే వారని గుర్తు చేసింది. తన 18వ పుట్టిన రోజు వేడుకలను అషాంటీ స్మిత్ ఫుల్ గా ఎంజాయ్ చేసిందని తల్లి తెలిపింది. తనకిష్టమైన కాక్ టైల్ తాగింది, బీచ్ లో తన స్నేహితులతో కలిసి శృంగారం కూడా చేసిందని తల్లి చెప్పింది.