Musk
Elon Musk tweet: ప్రపంచ అపర కుభేరుడు, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. “రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దమ్ముంటే ఒకరినొకరం ప్రత్యక్షంగా తేల్చుకుందాం రా” అంటూ సవాల్ విసురుతూ ఎలాన్ మస్క్ సోమవారం ట్వీట్ చేశారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో పుతిన్ అనుసరిస్తున్న యుద్ధ నీతిని ఎండగడుతూ మస్క్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. “నేను వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరి పోరాటానికి సవాలు చేస్తున్నాను, గెలిచినా వారు యుక్రెయిన్ పై వాటా కలిగి ఉంటారు” అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో వ్లాదిమిర్ పుతిన్ పేరును మాత్రం రష్యన్ భాషలో రాసుకొచ్చిన మస్క్..అందులో రష్యా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశాడు.
మొదటి ట్వీట్ చేసిన ఒక గంట అనంతరం “ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరిస్తున్నారా” అంటూ రష్యా అధ్యక్ష కార్యాలయాన్ని ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశాడు ఎలాన్ మస్క్. కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ శాటిలైట్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఉచిత ఇంటర్నెట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అమెరికా సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మస్క్ ఛాలెంజ్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే లక్షా పదివేల లైక్స్, 17 వేల రీ ట్వీట్స్, 6 వేలకు పైగా రిప్లైలు వచ్చాయి.
I hereby challenge
Владимир Путин
to single combatStakes are Україна
— Elon Musk (@elonmusk) March 14, 2022
Also read: China Lockdown: కొత్త వేరియంట్ లేదు అయినా చైనాలో లాక్ డౌన్? ఎందుకు?