Elon Musk Tesla : మరోసారి వార్తల్లో టెస్లా.. తీసుకున్న జీతాల్ని తిరిగి ఇచ్చేస్తామంటున్న డైరెక్టర్లు, ఆ మొత్తం ఎంతో తెలుసా..?

తాము తీసుకున్న అధిక జీతాలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు టెస్లా కంపెనీ డైరెక్టర్లు.

Elon Musk Tesla Directors' salaries

 

Elon Musk Tesla Directors’ salaries : ప్రపంచ వ్యాప్తంగా పేరొందినన ప్రముఖ కార్ల కంపెనీ ‘టెస్లా’ (Tesla)మరోసారి వార్తల్లోకొచ్చింది. దీంతో పాటు ఎప్పుడు వార్తల్లో ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)కూడా వార్తల్లోకొచ్చారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ (Electric car manufacturing)రంగంలో సంచలనాలు సృష్టించిన టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ( Tesla CEO Elon Musk)తో పాటు కంపెనీ డైరెక్టర్లు తీసుకుంటున్న భారీ జీతాల విషయం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. మస్క్ తో పాటు కంపెనీ డైరెక్టర్లంతా భారీ మొత్తాలను జీతాలుగా పొందుతున్నారని ఆ కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు షేర్ హోల్డర్లు (Shareholders)కోర్టును  ఆశ్రయించారు. కంపెనీ నిధుల్ని సీఈవో ఎలాన్ మస్క్ దుర్వినియోగం చేస్తున్నారని.. తన విలాసాల కోసం కంపెనీ నిధులు వాడుకుంటున్నారంటూ ఆరోపించారు.

ఈ కేసు విషయంలో మస్క్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈక్రమంలో తాము తీసుకున్న అలవెన్సులతో పాటు అధిక జీతాలను తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ డైరెక్టర్లు ప్రకటించారు. 2017 నుంచి 2020 మధ్యలో తమకు తామే కేటాయించుకున్న నిధులను, షేర్లను..వాటికి సంబంధించిన సుమారు 735 మిలియన్లను అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.6 వేల కోట్లను కంపెనీ ఖాతాలో జమచేస్తామని తెలిపారు. వీరిలో ఎలాన్ మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ కూడా ఉన్నారు. తిరిగి చెల్లించే పరిహారంలో భాగంగా ఎలాన్ మస్క్ 56 బిలియన్లు చెల్లించేందుకు పరిశీలిస్తున్నారు.

Microsoft Employee : ఏడాదిన్నరకే ఉద్యోగం కోల్పోయిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి.. కెరీర్‌లో ముచ్చటగా మూడోసారట..!

ఎలాన్ మస్క్ పే డీల్ ను రద్దు చేయటానికి ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్ లో ఒకరైన రిచర్డ్ టార్నెట్టా (Richard Tornetta)2019లో టెస్లాపై దావా వేశారు. టెస్లా డైరెక్టర్లు 2017 నుంచి 2020 వరకు దాదాపు 11మిలియన్ల స్టాక్ ఆప్షన్స్ తమకు అందకుండా చేశారని ఆరోపించారు. ఇది కార్పొరేట్ బోర్డుల ప్రమాణం కంటే భారీ స్థాయిలో ఉందని కంపెనీ వాటాదారులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ లో విలాసవంతమైన అద్దాల భవంతిని తనకోసం నిర్మించుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నించాడని రిచర్డ్ టార్నెట్టా ఆరోపించారు. ఇందుకోసం కంపెనీ నిధులలో నుంచి పెద్దమొత్తంలో కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. దీంతో పాటు 2018-2019 ఏడాదికి గానూ ఎలాన్ మస్క్ కనీవినీ ఎరగని రీతిలో కాంపెన్సేషన్ పొందారని, సీఈవో హోదాలతో తనకు తాను ఈ భారీ స్థాయి ప్యాకేజీ ప్రకటించుకున్నారని..ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీ అని ఆరోపించారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోందని రిచర్డ్ తెలిపారు.

Twitter DM Updates : ట్విట్టర్ DM సెట్టింగ్‌ అప్‌డేట్.. వెరిఫైడ్ యూజర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

కాగా ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే (Elon Musk is world’s highest-paid CEO)అత్యంత ఎక్కువ జీతం తీసుకునే సీఈవోగా పేరొందారు. ఆపిల్ సీఈవో టీమ్ కుక్ కంటే మస్క్ తీసుకునే జీతమే ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న CEOల్లో రాబర్ట్ స్కేరింగ్(Robert Scaringe),పీటర్ రాలిన్సన్ (Peter Rawlinson),టామ్ సీబెల్ (Tom Siebel),సత్య నాదెళ్ల (Satya Nadella),జో బే (Joe Bae),టోమర్ వీన్‌గార్టెన్ (Tomer Weingarten),అలెక్స్ కార్ప్(Alex Karp),సిడ్ సిజ్‌బ్రాండిజ్ (Sid Sijbrandij)ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు