Court judgment : బ్రేకప్ తరువాత వేధింపులు .. మహిళకు రూ.10 వేల కోట్లు పరిహారం

అమెరికాలోని టెక్సాస్‌ కోర్టు ‘రివెంజ్‌ పోర్న్‌’ కేసులో సంచలన తీర్పునిచ్చింది. బ్రేకప్ తరువాత వేధింపులకు గురైన మహిళకు రూ.10 వేల కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Texas woman Court big award

Texas woman Court big award : అమెరికాలోని టెక్సాస్‌ కోర్టు ‘రివెంజ్‌ పోర్న్‌’ కేసులో సంచలన తీర్పునిచ్చింది. బ్రేకప్ తరువాత వేధింపులకు గురిచేస్తు..అతనితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలతో వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది ధర్మాసనం. 1.2 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.10 వేల కోట్లు) చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు సదరు బాధిత మహిళ పేరు వెల్లడించలేదు. ఆమెను డీఎల్‌గా పేర్కొంటు ఈ తీర్పునిచ్చింది. ఆమె 2022లో తన బాయ్ ఫ్రెండ్ పై హారిస్ కౌంటీలో వేధింపుల కేసు దాఖలు చేసింది. 2016 నుంచి 2021 వరకు మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆ తరువాత 2021లోనే ఇద్దరికి బ్రేకప్ అయ్యింది. అప్పటినుంచి అతను తనను మానసికంగా..లైంగికంగా వేధించాడని ఆరోపిస్తు కేసు వేసింది.

Texas woman arrest : జడ్జీనే చంపేస్తానని బెదిరించిన టెక్సాస్ మహిళ అరెస్ట్

తాము సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో అడల్ట్ వెబ్ సైట్లలో పోస్ట్ చేసి తనను నానా రకాలుగా హింసించాడు అంటూ పిటీషన్ లో పేర్కొంది. ఆ లింకులను తన స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపేవాడని అలా చేయటం తనను వేధించడం, హింసించడం, అవమానించడం, బహిరంగంగా అవమానించడమేనని తనను న్యాయం చేయాలని కోరుతు పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ కేసు వాదనలో ఆమె తరపు న్యాయవాది నా క్లైంట్ ను సదరు వ్యక్తి గృహ హింస, లైంగిక వేధింపులకు గురి చేశాడని “రివెంజ్‌ పోర్న్” కేసు ఆధారంగా న్యాయం చేయాలని కోరారు.

ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానసిక వేధింపులకు 20 కోట్ల డాలర్లు, నష్టపరిహారం కింద 100 కోట్ల డాలర్లు చెల్లించాలని మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను ఆదేశించింది. కాగా.. బాధితురాలి తరపు న్యాయవాదులు 10 కోట్ల డాలర్ల పరిహారం ఇప్పించాలని కోరారు. కానీ అనుకున్నదానికంటే ఎక్కువగానే చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Joe Biden ice cream : అద్భుతమైన ఐస్‌క్రీములు కావాలంటే నన్ను అడగండి,అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు : జో బైడెన్‌

కాగా..యూఎస్‌లో రివెంజ్ పోర్న్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. మసాచుసెట్స్, సౌత్ కరోలినా మినహా టెక్సాస్‌తో సహా దాదాపు మొత్తం 50 రాష్ట్రాలు రివెంజ్ పోర్న్‌ను నిషేధించే చట్టాన్ని ఆమోదించాయి. రివెంజ్ పోర్న్‌ను నిషేధించే బిల్లును మసాచుసెట్స్ చట్టసభ సభ్యులు గత సంవత్సరం సమర్పించారు.అయితే ప్రస్తుతం శాసనసభ దీనిని పరిశీలిస్తోంది.