Astronaut Space : అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న వ్యోమగామి

ఓ వ్యోమగామి.. ఎవరితోనూ సంబంధం లేకుండా అసలు భూమినే వదిలేసి.. చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సహాయం లేకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం.

Space

astronaut alone in space : భూమి మీద తోటి మనుషులు లేకుండా, పక్షులు, జంతువులు సైతం కూడా లేకుండా ఒంటరిగా ఒక్కరే ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. తలుచుకుంటేనే భయమేస్తోంది కదా… అంతెందుకు మన ఇంట్లో ఒక్కరమే ఉంటే ఒంటరి ఫీలింగ్ వస్తుంది. అలాంటిది ఇంట్లో కాదు, ఊర్లో కాదు, భూమి మీద అసలే కాదు.. ఏకంగా అంతరిక్షంలో ఒంటరిగా ఒక్కరమే ఉండగలమా? కానీ ఓ వ్యోమగామి.. ఎవరితోనూ సంబంధం లేకుండా అసలు భూమినే వదిలేసి.. చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సహాయం లేకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. అయితే మీరే చూడండి.

సుమారు 40 ఏళ్ల క్రితం బ్రూస్ మెక్‌కాండెల్స్ II అనే వ్యోమగామి.. శాటిలైట్ రిపేర్ మిషన్‌ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. దాని కోసం శాటిలైట్ వదిలేసి కనీసం స్పేష్ షిప్‌తో తాడు సహాయం కూడా లేకుండా అలా అంతరిక్షంలోకి వచ్చేశాడు. ఇలా కనీసం స్పేస్ క్రాఫ్ట్‌తో చిన్న కనెక్షన్ కూడా లేకుండా ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేయడం ఇదే మొట్టమొదటి సారి.

Blue Origin Flight: ఆరు దశాబ్దాల కల.. జెఫ్ బెజోస్‌తో అంతరిక్షంలోకి 82ఏళ్ల ట్రైనీ మహిళా వ్యోమగామి!

ఈ అరుదైన సంఘటన 1984 ఫిబ్రవరిలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న బ్రూస్.. భూమి ఉపరితలానికి 170 మైళ్ల దూరంలో ఉన్నారు. అంతేకాకుండా గంటకు 17,500 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నారు. కానీ రోదసిలో ఉండే వర్చువల్ స్పేస్ వాక్యూమ్ కారణంగా అతనికి ఆ ఫీలింగ్ కూడా ఉండదట.

దీనికి సంబంధించిన ఫొటోను ఇప్పుడు ఒక సైన్స్ ట్విట్టర్ హాండిల్ నెట్టింట షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్య పడటమే కాకుండా భయపడిపోతున్నారు. ‘‘ఇంత కన్నా భయంకరమైన స్పేస్ ఫొటోను ఇప్పటి వరకూ చూడలేదు’’ అని కొందరు అంటే.. ‘‘ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా వెళ్లిపోవాలనుకునే వాళ్లు ఇంతకన్నా దూరంగా వెళ్లలేరేమో’’ అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.