First Earth photo : 52ఏళ్ల క్రితం.. ఇదే రోజున చంద్రుడి నుంచి తీసిన భూమి మొదటి ఫొటో..!
చంద్రుని ఉపరితలం నుంచి 52ఏళ్ల క్రితమే భూమి మొదటి ఫొటోను తీశారు. 1966, ఆగస్టు 23న నాసా స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని ఉపరితలం నుంచి మొదటిసారి భూమిని ఫొటో తీసింది.

The First Earth Photo From Moon Was Taken On This Day
The first Earth photo from Moon was taken on this day : చంద్రుని ఉపరితలం నుంచి 52ఏళ్ల క్రితమే భూమి మొదటి ఫొటోను తీశారు. 1966, ఆగస్టు 23న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని ఉపరితలం నుంచి మొదటిసారి భూమిని ఫొటో తీసింది. 16వ కక్ష చేరుకున్న సమయంలో సరిగ్గా ఇదే రోజు (ఆగస్టు 23)న భూమి ఫొటోను నాసా అంతరిక్ష నౌక క్లిక్ అనిపించింది. 9 రోజుల ముందు అంతరిక్ష నౌక చంద్రుడి కక్ష్యలోకి దిగింది. అపోలో మిషన్ 11లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై దిగిన అంతరిక్ష నౌక భూమి ఫొటోలను తీసి పంపింది.
అమెరికా 1960 ప్రారంభంలో నాసా అపోలో మిషన్‌ను ప్రారంభించింది. చంద్రునిపై మానవులను అడుగుపెట్టేలా చేయడమే ఈ మిషన్ లక్ష్యంగా నాసా పేర్కొంది. అప్పట్లో సైంటిస్టులకు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పూర్తిస్థాయిలో ఎలాంటి ఫొటోలు లభ్యం కాలేదు. అపోలో మిషన్ అంతరిక్ష నౌక చంద్రునిపై ఎక్కడ ల్యాండింగ్ అవుతుందో తెలుసుకుని అక్కడి నుంచి ఫొటోలు తీశారు. 1966 ఆగష్టు 10న ఆర్బిటర్-1ను నాసా లాంచ్ చేసింది. ఈ అంతరిక్ష నౌకలో ప్రధాన ఇంజిన్‌తోపాటు 68 కిలోల కొడాక్ ఇమేజింగ్ సిస్టమ్, 4 సోలార్ ప్లేట్లు అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి నుంచి కనిపించే ఇతర గ్రహాల ఫొటోలను తీసేందుకు వీటిని అమర్చారు.
Space Debris Collision: అంతరిక్షంలో శిథిలాల ఘర్షణ.. దెబ్బతిన్న చైనా శాటిలైట్!
అంతేకాదు.. ఆగస్ట్ 14న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేరిన ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష నౌక కూడా ఇదే కావడం విశేషం. అప్పటినుంచి కనిపించే గ్రహాల ఫొటోలను తీయడం ప్రారంభించింది. అలా చివరిగా ఆగస్టు 23వరకు భూమి ఫొటోలను పంపింది. ఆగస్ట్ 28 నాటికి నాసా అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలం నుంచి మొత్తం 205 ఫొటోలను పంపింది.
అక్టోబర్ 29న చంద్రుడి ఉపరితలాన్ని తాకిన అనంతరం ఈ నౌక పేలిపోయింది. మరొక ఫొటో 1947లో భూమికి 100 మైళ్ల దూరం నుంచి తీశారు. ఆ తర్వాత ఏళ్లలో భూమి ఫొటోలను వందలాదిగా తీశారు. 1970 వరకు తీసిన భూమి ఫొటోలే ఎంతో ప్రత్యేకమైనవి. 1972లో అపోలో 17 మిషన్ సమయంలో ఈ భూమి ఫొటోను తీశారు. అప్పుడే భూమి నీలం రంగులో ఉంటుందని గుర్తించారు. దీనికి Blue Marble అని పేరు పెట్టారు.
అలాగే భూమికి మరోవైపు చీకటి ప్రదేశాన్ని కూడా నాసా ఒక ఫొటోను విడుదల చేసింది. దీనికి బ్లాక్ మార్బల్ (Black Marble)గా పేరు పెట్టింది. రానురాను భూమి ఫొటోలను అత్యంత దూరంలో నుంచి కూడా తీయడం మొదలైంది. అందులో ఒకటి ది పాలె బ్లూ డాట్ (The Pale Blue Dot) పేరు పెట్టారు. మరో భూమి ఫొటోను 1990, ఫిబ్రవరి 14న తీశారు. 4 బిలియన్ల మైళ్ల దూరంలోని Voyager 1 నుంచి భూమిని ఫొటో తీసింది.