Hong kong cricket team
Hong Kong cricket team: నేటి నుంచి ఆసియా కప్- 2022 టీ20 టోర్నీ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు శ్రీలంక, ఆప్గానిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోంటుండగా 13 మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్ జట్లు తొలుత ఎంపిక కాగా క్వాలీఫై మ్యాచ్ ఆడి హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది.
Hong Kong: ఆసియా కప్‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. గ్రూప్ – Aలో భారత్, పాక్‌తో ఢీ
ఈవారం ప్రారంభంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో హాంకాంగ్ జట్టు గెలుపొందింది. దీంతో ఆసియా కప్ 2022కి అర్హత సాధించింది. గ్రూప్ -ఏలో భాగంగా ఆగస్టు 31న భారత్‌తోనూ, సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఈ జట్టు తలపడనుంది.
అయితే ఆసియా కప్ కు అర్హత సాధించిన తరువాత హాంకాంగ్ టీం ఆటగాళ్లు సందడి చేశారు. బార్ బార్ దేఖో సినిమాలోని ‘కాలా చష్మా’ పాటకు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. వికెట్ కీపర్ జీషన్ అలీ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.