Hong Kong: ఆసియా కప్‌‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. గ్రూప్ – Aలో భారత్, పాక్‌తో ఢీ

ఆసియా కప్‌కు హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. టోర్నీలో అర్హతకోసం నిర్వహించిన మ్యాచ్‌లో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి హాంకాంగ్ విజయం సాధించింది. ఈ జట్టు గ్రూప్ -ఏలో ఇండియా, పాకిస్థాన్ తో తలపడనుంది.

Hong Kong: ఆసియా కప్‌‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. గ్రూప్ – Aలో భారత్, పాక్‌తో ఢీ

Hongkong

Hong Kong: ఆసియా కప్‌కు హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. టోర్నీలో అర్హతకోసం నిర్వహించిన మ్యాచ్‌లో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి హాంకాంగ్ విజయం సాధించింది. దీంతో ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌తో కలిసి గ్రూప్ -ఏలో చేరిన హాంకాంగ్.. భారత్, పాక్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 31 భారత్, సెప్టెంబర్ 2న పాకిస్థాన్ తో గ్రూప్ దశలో హాంకాంగ్ జట్టు తలపడుతుంది.

Asia Cup 2022: బంతులను జోరుగా బాదుతూ, నెట్స్‌లో సాధన చేస్తూ కొహ్లీ బిజీబిజీ.. వీడియో

హాంకాంగ్ జట్టు ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే వన్డే ఫార్మాట్ లో జరిగిన టోర్నీలో ఇప్పటి వరకు మూడు సార్లు భాగమైంది. ఇదిలాఉంటే ఆసియా కప్‌కు అర్హత కోసం జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ తలపడ్డాయి. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 147 పరుగుల చేసింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. యాసిమ్ ముర్తాజా అత్యధికంగా 58 పరుగులు చేశాడు.

Asia Cup 2022: పాక్ జట్టుకు అంత సీన్ లేదు.. దాయాదుల పోరులో టీమిండియాదే విజయమన్న పాక్ మాజీ క్రికెటర్

ఇదిలాఉంటే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆగస్టు 28న ఈ రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. బుధవారం భారతదేశం, పాకిస్తాన్ నుండి ఆటగాళ్ళు యుఏఈలో దిగిన తర్వాత ప్రాక్టిస్ సెషన్‌లో పాల్గొన్నారు. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం లు కరచాలనం చేసుకున్నారు.