Asia Cup 2022: పాక్ జట్టుకు అంత సీన్ లేదు.. దాయాదుల పోరులో టీమిండియాదే విజయమన్న పాక్ మాజీ క్రికెటర్

మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ -2022 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Asia Cup 2022: పాక్ జట్టుకు అంత సీన్ లేదు.. దాయాదుల పోరులో టీమిండియాదే విజయమన్న పాక్ మాజీ క్రికెటర్

India vs pakistan

Asia Cup 2022: మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ -2022 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇరు జట్లలో ఎవరిది పైచేయి అవుతుందనే విషయంపై ఇరుదేశాల మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసియా కప్ లో తలబడే పాక్ – భారత్ జట్లలో అధికశాతం విజయావకాశాలు భారత్ కే ఉంటాయని చెప్పారు. ఇందుకు కారణాలను కూడా వివరించాడు.

Asia Cup 2022: అవును.. ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకుంటుంది: పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్

టీమిండియాలో అత్యుత్తమ బౌలింగ్ విభాగం ఉందని, ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్ర అశ్విన్, చాహల్, రవి బిష్ణోష్, రవీంద్ర, జడేజాతో పాటు ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్స్దీప్ సింగ్ వంటి వారు ఉన్నారని, వీరంతా మ్యాచ్ గెలుపులో కీలక భూమిక పోషించగలరని కనేరియా అన్నాడు. అయితే పాకిస్థాన్ జట్టులో ఆ స్థాయిలో బౌలింగ్ విభాగం బలంగా లేదని తెలిపాడు. దీనికితోడు పాక్ జట్టులో నసీమ్ షా మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, షహీన్ షా అఫ్రీదికి ఫిట్ నెస్ సమస్య ఉందని అన్నాడు.

India Squad For Asia Cup 2022 : ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక.. మళ్లీ జట్టులోకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ అంటే ఎక్కువ సార్లు టీమిండియానే విజయం సాధించిందని, పాక్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేదని తెలిపాడు. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందని, అయితే ఆ ప్రభావం ప్రస్తుతం ఆసియా టోర్నీలో ఉంటుందని నేను అనుకోవటం లేదని డానిష్ కనేరియా అన్నాడు. మొత్తానికి భారత్ కు 60శాతం విజయావకాశాలు ఉంటే పాకిస్థాన్ కు 40శాతం విజయాశాలు ఉంటాయని నేను అంచనా వేస్తున్నానని పేర్కొన్నాడు.