Asia Cup 2022: అవును.. ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకుంటుంది: పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్

''అవును, ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకోగలదు. ఎందుకు గెలుచుకోలేదు? టీమిండియా ఏమైనా విటమిన్ సీ లోపంతో బాధపడుతుందా? (నవ్వుతూ).. వారు ఆడుతోన్న తీరు, భారత జట్టులో ఉన్న సమర్థమైన ఆటగాళ్ళను చూసి టీమిండియనే ఫేవరెట్ గా అందరూ భావిస్తున్నారు'' అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించారు.

Asia Cup 2022: అవును.. ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకుంటుంది: పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్

Asia Cup 2022

Asia Cup 2022: ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకుంటుందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నారు. శ్రీలంకలో జరగాల్సిన ఆసియా క‌ప్‌ను దుబాయి, షార్జాకు మార్చిన విషయం తెలిసిందే. ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌రగనుంది. టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించే ఈ టోర్నీలో టీమిండియా గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నారు.

తాజాగా, పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ”అవును, ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకోగలదు. ఎందుకు గెలుచుకోలేదు? టీమిండియా ఏమైనా విటమిన్ సీ లోపంతో బాధపడుతుందా? (నవ్వుతూ).. వారు ఆడుతోన్న తీరు, భారత జట్టులో ఉన్న సమర్థమైన ఆటగాళ్ళను చూసి టీమిండియనే ఫేవరెట్ గా అందరూ భావిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. పాక్ జట్టుకు అన్నీ అనుకూలిస్తే ఏ జట్టుపై అయినా సరే గెలవగలుగుతుందని చెప్పారు. ఈ నెల 27న శ్రీలంక, అప్గానిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 28న భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి. ఆసియా కప్ లో ఆరు జట్లు ఆడనున్నాయి. రెండు గ్రూపులుగా ఆడతాయి. ఆసియా కప్ కు ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది.

China-Pakistan Economic Corridor: భారత్ అభ్యంతరాలు చెబుతున్నా.. సీపీఈసీ ప్రాజెక్టులో అఫ్గాన్‌ను చేర్చేందుకు పాక్-చైనా కుయుక్తులు