Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా

ప్రపంచంలో కొవిడ్ కంటే ప్రాణాంతకమైన ఎక్స్ మహమ్మారి ప్రబలవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఈ ఎక్స్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని చంపే అవకాశముందని పేర్కొంది....

Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా

Next Pandemic Disease X

Updated On : September 26, 2023 / 5:11 AM IST

Next Pandemic Disease X : ప్రపంచంలో కొవిడ్ కంటే ప్రాణాంతకమైన ఎక్స్ మహమ్మారి ప్రబలవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఈ ఎక్స్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని చంపే అవకాశముందని పేర్కొంది. (Next Pandemic Disease X) భూ గృహంపై దాగి ఉన్న మిలియన్ల కొద్దీ వైరస్ ల నుంచి ఎక్స్ మహమ్మారి ప్రబలే అవకాశముందని ఇద్దరు వ్యాక్సిన్ నిపుణులు వెలువరించిన కొత్త పుస్తకంలో హెచ్చరించారు. (Next Pandemic)

BRS Tension : ఎన్నికల వేళ గులాబీ పార్టీలో గుబులు, ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్

శతాబ్దం క్రితం స్సానిష్ ఫ్లూ లాగే ఈ ఎక్స్ మహమ్మారి 50 మిలియన్ల మందిని చంపగలదని రచయితలు పేర్కొన్నారు. (Disease X Is Deadlier Than COVID-19) యూకే వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఛైర్మన్ అయిన కేట్ బింగ్‌హామ్, మాజీ పాత్రికేయుడు, రాజకీయ సలహాదారు టిమ్ హేమ్స్ కలిసి ‘ది నెక్స్ట్ కిల్లర్: హౌ టు స్టాప్ ది నెక్స్ట్ పాండమిక్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. భూమిపై ఉన్న వైరస్ లు మనుషులకు ముప్పు ఎలా కలిగిస్తాయో వారు పుస్తకంలో వివరించారు.

CM Jagan : జైల్లో చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమా? సీఎం జగన్ నిర్ణయం ఏంటి?

భూమిపై 25 వైరస్ కుటుంబాలను గుర్తించారని, వీటిలో ఏదైనా ఎక్స్ మహమ్మారి ప్రబలటానికి కారణమవుతుందని చెప్పారు. ఎబోలా, హెచ్‌ఐవి,ఎయిడ్స్, కొవిడ్-19 కేసులలో కనిపించే విధంగా వైరస్‌లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి నాటకీయంగా పరివర్తన చెందుతాయని వారు హెచ్చరించారు. ఈ రచయితల హెచ్చరికలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిగణనలోకి తీసుకొని ఎక్స్ మహమ్మారి సంభావ్యతపై ప్రపంచాన్ని హెచ్చరించింది.

Jayam Ravi : పిల్ల‌ల‌తో క‌లిసి మా చిత్రాన్ని చూడొద్దు.. స్టారో హీరో రిక్వెస్ట్‌

ఎక్స్ మహమ్మారి జూనోటిక్ వ్యాధి అని, ఇది అడవి, పెంపుడు జంతువుల్లో ఉద్భవించి ఎబోలా, హెచ్ఐవీ, ఎయిడ్స్, కొవిడ్ లాగా మనుషులకు సోకుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎక్స్ మహమ్మారి ఎప్పుడు వ్యాప్తి చెందుతుందనే విషయం కాదని, దానిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.