Guinness World Record : బాబోయ్ .. రికార్డ్ కోసం మిరపకాయల్ని చాక్లెట్‌లా నమిలేశాడు

కాస్త కారం ఎక్కువైతే గంతులేస్తాం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు తినడం అంటే? ఇంకేమైనా ఉందా.. కానీ వాటిని తిని ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి గురించి చదవండి.

Guinness World Record

Guinness World Record : రెగ్యులర్‌గా తినే ఫుడ్‌లో కాస్త కారం ఎక్కువైతే కుర్రో..మొర్రో అని గంతులేస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయల్ని పరపరా నమిలేశాడు. అంతేనా? ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

Uttar Pradesh : పొడవైన జుట్టుతో ఉత్తరప్రదేశ్ మహిళ గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించుకోవడానికి అనేకమంది చేసే వింత వింత పనులు చూస్తూ ఉంటాం. కొన్ని హారిబుల్‌గా ఉంటాయి. కొన్ని ప్రమాదకరంగా కూడా అనిపిస్తాయి. ప్రాణాలకు తెగించి ఈ ఫీట్లు ఎందుకు అని అనుకుంటాం. కానీ రికార్డ్స్ కోసం కొందరు పట్టుదలగా ముందుకు వెళ్తారు. అందులో ఒక రికార్డ్ గురించి ఇప్పుడు చెప్పబోయేది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు భుట్ జో‌లోకియా అంటారు. వీటిని 30 సెకండ్లలో 10 మిరపకాయలు తిని ప్రపంచ రికార్డు సాధించారు యూఎస్‌కి చెందిన గ్రెగ్ ఫోస్టర్.  గతంలో కూడా ఇదే తరహా రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి.

డిసెంబర్ 2021 లో 8.72 సెకండ్లలో మూడు కరోలినా రీపర్ మిరపకాయల్ని అత్యంత వేగంగా తిన్న వ్యక్తిగా గ్రెగ్ రికార్డు సాధించారు. ఇప్పుడు మరో ఫీట్ సాధించారన్నమాట. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్, అస్సాంలలో పండే భుట్ జో‌లోకియా మిరపకాయలు విపరీతమైన ఘాటుగా ఉంటాయి. వీటిని 30.01 సెకండ్లలో 10 తిని గ్రెగ్ ఫోస్టర్ రికార్డు సాధించారు. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Guinness World Records : 93 వ పుట్టినరోజు జరుపుకున్న ట్రిప్లెట్స్.. గిన్నిస్ రికార్డ్ సాధించిన సోదరులు

డిసెంబర్ 2021లో గ్రెగ్ 8.72 సెకన్లలో మూడు కరోలినా రీపర్ మిరపకాయలను అత్యంత వేగంగా తిన్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పారు. 2017లో ఒకే నిముషంలో 120 గ్రాముల కరోలినా రీపర్ చిల్లీ పెప్పర్స్‌ని తింటూ సరికొత్త రికార్డు సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి నివేదిక ప్రకారం గ్రెగ్ ఎక్కువగా కారంగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారట. స్పైసీ ఫుడ్ తినడానికి సహనంగా ఉండటమనేది కొన్నేళ్లుగా అలవర్చుకున్నారట. అతను ఇప్పుడు ప్రపచంలోని అత్యంత ఘాటైన మిరియాలు కూడా తింటున్నారట. గ్రెగ్ రికార్డు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అతను ఇంత కారాన్ని తిని మొద్దుబారిపోయి ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు