Uttar Pradesh : పొడవైన జుట్టుతో ఉత్తరప్రదేశ్ మహిళ గిన్నిస్ రికార్డ్

పొడవైన జుట్టుకోసం ఆడవారు చేయని ప్రయత్నం ఉండదు. రకరకాల ఉత్పత్తులు సైతం వాడుతుంటారు. ఉత్తప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించింది.

Uttar Pradesh : పొడవైన జుట్టుతో ఉత్తరప్రదేశ్ మహిళ గిన్నిస్ రికార్డ్

Uttar Pradesh

Uttar Pradesh : పొడవైన జుట్టుకోసం ఆడవారు చేయని ప్రయత్నం ఉండదు. కాస్త జుట్టు రాలుతుంటే కంగారుపడతారు. జుట్టు పెరగడం కోసం రకరకాల ప్రాడక్ట్స్ వాడతారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ తన పొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆమె జుట్టు పొడవెంతో తెలుసా?

Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?

పొడవైన కురులు ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. కొందరు ఫ్యాషన్ కోసం జుట్టు కత్తిరించుకున్నా.. మెత్తని, ఒత్తైన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. రకరకాల ప్రాడక్ట్స్ అప్లై చేస్తుంటారు. సాధారణంగా మోకాలివరకు జుట్టున్న ఆడవారిని చూస్తుంటాం. కానీ ఓ మహిళ జుట్టు ఏకంగా 7 అడుగుల 9 అంగుళాలు. ఇంత పొడవైన జుట్టుతో ఆమె గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 సంవత్సరాల స్మిత శ్రీవాత్సవ తన పొడవైన జుట్టుతో గిన్నిస్‌లో స్ధానం సంపాదించింది. జుట్టు పొడవుగా ఉంటే సరిపోదు.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఆమె పడ్డ కష్టాలు మామూలుగా లేవు.

స్మిత తన జుట్టును 14 సంవత్సరాలుగా కత్తిరించకుండా కాపాడుకుంటూ వచ్చారట. 1980 లలో సినీ నటీమణుల పొడవైన వాలుజడలను ఆదర్శంగా తీసుకుని ఆమె జుట్టును కత్తిరించకుండా పెంచడం ఇప్పుడు రికార్డు సాధించడానికి ఎంతగానో ఉపకరించిందట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు చెప్పిన ప్రకారం స్మిత వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తారట. చేసిన ప్రతిసారి 3 గంటల సమయం పడుతుందట. ఆమె తన జుట్టును ఆరబెట్టుకున్న సమయంలో చాలామంది ఆశ్చర్యంగా చూస్తారట. తరచుగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టు పెరుగుదల సీక్రెట్ అడుగుతుంటారట. అంతేనా ఫోటోలు తీసుకుంటారట.

Guinness Record : పేక ముక్కలతో ప్యాలెస్ కట్టేసి గిన్నిస్ రికార్డు .. 15 ఏళ్ల కోల్‌కతా కుర్రాడి ఘనత

తన పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకున్న స్మిత కల నెరవేరింది. అందుకు తన జుట్టుపై ఆమె పెట్టిన శ్రద్ధ, అంకిత భావమే కారణం. ‘దేవుడు నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు’ .. ఈ రికార్డు సాధించడం నాకు సంతోషంగా ఉందని చెప్పారు స్మిత శ్రీవాత్సవ.