Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?
యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సాధించారు. పి బాలసుబ్రమణ్యన్ మీనన్ 98 ఏళ్ళ వయసులో..

Anchor Suma post about grand father guinness book
Anchor Suma : టాలీవుడ్ యాంకర్ సుమ.. మలయాళీ అమ్మాయిగా తెలుగులో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు. యాంకర్ గా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా ఆడియన్స్ ని ఏదో రకంగా సుమ ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఆమె కుటుంబసభ్యుల విషయాలను కూడా సుమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన తాతయ్య గురించిన ఒక పోస్ట్ వేశారు.
ఆమె అమ్మమ్మ గారి బ్రదర్ పి బాలసుబ్రమణ్యన్ మీనన్ 98 ఏళ్ళ వయసులో అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయన ఒక అడ్వకేట్. గత 73 ఏళ్ళగా ఈయన ఈ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్ గా మీనన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు ఇది గమనించి.. ఆయనకు అవార్డుని అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సుమ.. ఆమె సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also read : Vijay Devarakonda : రష్మిక మార్ఫింగ్ వీడియో పై ఫైర్ అయిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్
View this post on Instagram
ఇది ఇలా ఉంటే, సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘బబుల్ గమ్’ అనే వెరైటీ టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ నుంచి సాంగ్ అండ్ టీజర్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మొదటి సినిమాలోనే రోషన్ హీరోయిన్ కి ఘాటు లిప్‌లాక్ కి ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు.