Ebola Virus Leak Lab : ల్యాబ్‌ నుంచే ఎబోలా వైరస్‌ లీక్‌?

ఎబోలా వైరస్‌ 2014లో ఆఫ్రికాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌లాగే ఎబోలా వైరస్ కూడా ల్యాబ్‌ నుంచి లీక్‌ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ebola virus

Ebola Virus Leak Lab : ప్రాణాంతకమైన వైరస్‌ ఎబోలా 2014లో ఆఫ్రికాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌లాగే ఎబోలా వైరస్ కూడా ల్యాబ్‌ నుంచి లీక్‌ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్‌ దేశ ల్యాబ్‌ నుంచి ఎబోలా వైరస్‌ ప్రమాదవశాత్తు లీక్‌ అయినట్టు విస్కాన్సిన్‌ వర్సిటీ మాజీ పరిశోధకుడు డాక్టర్‌ జోనాథన్‌ లాథమ్‌, జర్నలిస్ట్‌ సామ్‌ హుస్సేనీ ఆరోపించారు.

Marburg Virus : మరో ప్రాణాంతకమైన వైరస్ కలకలం..ఆఫ్రికాలో గుర్తింపు

కెనెమా ల్యాబ్‌లో లస్సా జ్వరంపై యూఎస్‌ నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనం సమయంలో ఎబోలా వైరస్‌ లీక్‌ అయినట్టు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ల్యాబ్‌ ఎబోలా మాదిరిగానే హెమరేజిక్‌ వైరస్‌లలో ప్రత్యేకత కలిగి ఉండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తుంది.