129 Deer Corona : అమెరికాలో 129 జింకలకు కరోనా..మూడు రకాల వేరియంట్లు గుర్తింపు

అమెరికాలో 129 జింకలకు కోవిడ్ మహమ్మారి సోకింది. జంతువుల్లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని జింకల్లో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయని గుర్తించారు.

129 Deer in US Infected With Coronavirus : గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వని కోవిడ్ మహమ్మారిని మనుషులనే కాదు మూగ ప్రాణుల్ని కూడా కుదురుగా ఉండనివ్వటంలేదు. ఈ క్రమంలో అమెరికాలో 129 జింకలకు కోవిడ్ మహమ్మారి సోకింది. అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో జంతువుల్లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

Read more :Corona Update : దేశంలో పెరిగిన కరోనా కేసులు

యూఎస్ లోని ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో తెల్లతోక జింకలు 129 దాకా కరోనా బారిన పడినట్లు తేలింది. ఈ జింకల్లో మూడు రకాల వేరియంట్లు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల నుంచే జింకలకు ఈ వైరస్‌ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 2021 జనవరి-మార్చి మధ్య తొమ్మిది ఈశాన్య ఒహియో ప్రదేశాలలో 360 తెల్ల తోక గల జింకల నుంచి నమూనాలను సేకరించి పరిక్షలు చేయగా 129 జింకల్లో మూడు రకాల ఉన్నట్లు గుర్తించారు.

Read more : Omicron Medicine : ఒమిక్రాన్ మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు

జింకలకు సోకిన కరోనా వైరస్‌లో మూడు వేరియంట్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకులు ఈశాన్య ఒహాయోలోని తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్లతోక జింకల నాసల్‌ స్వాబ్స్‌ సేకరించారు. పీసీఆర్‌ టెస్టింగు ద్వారా ఇందులోని 129 జింకల్లో (35.8%) మూడు రకాల వేరియంట్లను గుర్తించారనే అధ్యయనానికి సంబంధించిన వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. అడవి జింకలు సార్స్‌ కోవ్‌-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు