Omicron Medicine : ఒమిక్రాన్ మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు

ఒమిక్రాన్ బారిన పడ్డ వారికి ఏం మందులు ఇస్తారు? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Omicron Medicine : ఒమిక్రాన్ మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు

Omicron Medicine

Omicron Medicine : కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త రూపంలో మళ్లీ విరుచుకుపడింది. “ఒమిక్రాన్” వేరియంట్ రూపంలో ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తొలుత సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, ఒమిక్రాన్ బారిన పడ్డ వారికి ఏం మందులు ఇస్తారు? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి డాక్టర్లు ఒమిక్రాన్ రోగులకు ఇచ్చే మందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు.

Bank Account KYC : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ అకౌంట్లు పని చేయవు..

ఒమిక్రాన్ బారినపడ్డ రోగులకు అందించే మందుల వివరాలను లోక్ నాయక్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులకు మల్టీ విటమిన్ ఔషధాలతో పాటు పారాసెటమాల్ మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఇతర ఔషధాలు ఏవీ అససరం లేదని భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరుతున్న ఒమిక్రాన్ రోగుల్లో 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. కొంతమందిలో మాత్రం గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. అదీ చాలా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. లోక్ నాయక్ ఆసుపత్రిలో మొత్తం 40మంది ఒమిక్రాన్ బాధితులు ఉండగా, వారిలో 19మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు.

దేశంలో నమోదైన ఒమిక్రాన్​ వివరాలను (డిసెంబర్ 24 సాయంత్రం వరకు) కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం ఒమిక్రాన్​ కేసుల్లో 244 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 114 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 88 ఒమిక్రాన్ కేసులున్నాయి.

కాగా, క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కట్టడి చేసేందుకు ఆయా దేశాలు సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజుల నుంచి బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి కొన్ని దేశాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం మరింత ఆందోళన కలిగించే విషయం. జనాభా తక్కువ ఉండే దేశాల్లోనే ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతుంటం ఆందోళనకర పరిణామం.

Garlic : రోజూ వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

అటు కోవిడ్, ఇటు ఒమిక్రాన్.. ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోదీ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా సహా పలు రాష్ట్రాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు.