Amazon CEO: అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్ ఆఖరి రోజు

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకునే సమయం వచ్చేసింది. జూలై 5న సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Amazon CEO: అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్ ఆఖరి రోజు

Amazon Ceo Jeff Bezos

Updated On : July 5, 2021 / 1:55 PM IST

Amazon CEO: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకునే సమయం వచ్చేసింది. జూలై 5న సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994లో అదే తేదీన సరిగ్గా 27 ఏళ్ల క్రితం అమెజాన్ విలీనం అయ్యిందని అమెజాన్ వాటాదారుల సమావేశంలో బెజోస్ వివరించారు.

ఫిబ్రవరిలో బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది. జెఫ్ స్థానంలో ఉన్న జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్-కంప్యూటింగ్ బిజినెస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవి నుంచి తప్పుకున్న అనంతరం బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ ఇంటర్నెట్‌తో పుస్తకాలను అమ్మడం ద్వారా అమెజాన్‌ సంస్థను జెఫ్ బెజోస్ ప్రారంభించారు.

జూలై 5 బెజోస్‌కు చాలా సెంటిమెంట్. అందుకే అదే రోజున సీఈఓ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

చిరకాల కోరిక నెరవేర్చుకోవడానికే:
అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తాను..తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ (Blue Origin) తయారు చేసిన న్యూ షెపర్ట్ రాకెట్ లో సోదరులిద్దరూ..2021, జులై 20వ తేదీన గగనంలో విహరించనున్నారు.

అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే..ఆ ఫీలింగ్ అద్బుతంగా ఉంటుందని పోస్టు చేసిన వీడియోలో వెల్లడించారు. సబ్ ఆర్బిటల్ రాకెట్ సిస్టం న్యూ షెపర్డ్.. జెఫ్ బెజెస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా వ్యోమగాములతో టేకాఫ్ తీసుకోనుంది. భూమితో తన బంధాల్ని మార్చేస్తుందని, నింగికెగరడం ఓ సాహసమేనని అభివర్ణించారు. ఆన్‌లైన్‌లో వేలం వేసి సీటును దక్కించుకున్న వ్యక్తి కూడా ఇందులో ప్రయాణించనున్నాడు.

ప్రత్యేకంగా కంపెనీ నిర్మించి:
బ్లూ ఒరిజన్ అనేది ఏరో స్పేస్ కంపెనీ. దీనిని 2000లో బెజోస్ స్థాపించిన సంగతి తెలిసిందే. మే 05వ తేదీ నుంచి చివరి సీటును ఆన్ లైన్ లో వేలం పెట్టారు. మే 19వ తేదీన బిడ్డింగ్ ను సీల్ చేశారు. ఈనెల 10వ తేదీన బిడ్డింగ్ తెరవనున్నారు. అత్యధిక బిడ్ విలువ రూ. 2.88 మిలియన్ డాలర్లు.

ఇక రాకెట్ విషయాలకు వస్తే..ఈ రాకెట్ లో ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. సముద్రమట్టం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ లైన్ వరకు రాకెట్ వెళుతుంది. అక్కడ క్యాప్యూల్ నుంచి బూస్టర్ వేరు అవుతుంది. ఈ సమయంలో రాకెట్ లో ఉన్న వారు భూమి ఎలా ఉందో సంపూర్ణంగా చూసే ఛాన్స్ ఉంది. గురుత్వాకరణ శక్తి లేకుండా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది. అనంతరం బూస్టర్, క్యాప్సూల్ లు వేర్వేరుగా ల్యాండ్ అవుతాయి.