GPS Wrong Direction
GPS Wrong Direction : ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన వాహనంలో GPSని అనుసరించి వెళ్తాం. అయితే ఒక్కోసారి GPS రాంగ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు టూరిస్టులు ప్రయాణిస్తున్న కారు సముద్రంలోకి వెళ్లిపోయింది. సమయానికి స్ధానికులు వారిని కాపాడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
సీజ్ చేసిన SUVలో పోలీసుల జాయ్ రైడ్.. GPSతో కారు లాక్ చేసి 3 గంటలు చుక్కలు చూపించిన యజమాని!
ఇద్దరు టూరిస్టులు కారులో ప్రయాణిస్తున్నారు.. గుడ్డిగా GPSని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఇంకేముంది కారు మునిగిపోవడం మొదలైంది. కాపాడమంటూ వారు చేసిన హాహా కారాలకి స్ధానికులు వెంటనే స్పందించారు. వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి నీటిలో దూకారు. కారు విండోలు కొన్నిక్షణాల్లో మునిగిపోతాయనగా కారునుంచి వారిని సురక్షితంగా బయటకు లాగారు.
ఏప్రిల్ 6 నుంచి పనిచేయదు: మీ ఫోన్‌లో GPS అప్‌డేట్ చేసుకోండి
గడువు ముగిసిన మ్యాప్‌లను డిజిటల్ ప్రొవైడర్లు అప్ డేట్ చేయకపోవడం వల్ల GPS సరిగా పనిచేయకపోవచ్చునట. ఇక సిగ్నల్ సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి అవాంతరాలు ఏర్పడతాయట. అయితే టూరిస్టులు మరీ అంత గుడ్డీగా సముద్రంలోకి కారును మళ్లించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భూమి మీద నూకలున్నాయి కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు.