ఆడు మగాడ్రా బుజ్జీ: బిడ్డకు జన్మనిచ్చాడు

ఆడు మగాడ్రా బుజ్జీ:  బిడ్డకు జన్మనిచ్చాడు

గర్భధారణనే ఇబ్బందిగా ఫీలవుతున్న మహిళలు.. సర్గోసి ద్వారా వేరే మహిళల గర్భాలలో పిల్లలను కంటున్నారు. అలాంటి ఈ సమాజంలో తల్లి కావాలనుకున్న ఓ ట్రాన్స్‌జెండర్ ప్రయోగం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మగాడిగా పుట్టిన యువకుడు తల్లిగా మారడం అద్భుతంగా అభివర్ణిస్తున్నారు వైద్యులు సైతం. 

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన విల్లే సిమ్సన్.. పురుషుడు స్టీఫెన్ గేత్‌తో చేస్తున్న ఏడేళ్ల సహజీవనానినిక గుర్తుగా ఓ బిడ్డ పుట్టాడు. ముందుగా మగాడైన విల్లే శస్త్ర చికిత్స ద్వారా మహిళగా మారాడు. అంతటితో ఆగక ఓ బిడ్డకు జన్మవివ్వాలని కోరుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా 2012 నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. డాక్టర్లను సంప్రదిస్తే.. పురుషుడు మహిళగా మారడం సాధ్యమే కానీ, గర్భ సంచి లేకుండా గర్భం దాల్చడం కష్టమని చెప్పారు. 
Read Also : అత్యాచార నిందితుడికి కోర్టు కండీషన్: 5 మొక్కలు నాటు.. అరెస్ట్ వారెంట్ రద్దు చేస్తాం!

కానీ, గతేడాది నుంచి శరీరాకృతి మార్పులు రావడం గమనించాడట. వైద్యుల్ని సంప్రదిస్తే వారు ఆశ్చర్యపోయారట. ఎన్నేళ్ల నుంచో తాను కంటోన్న కల నెరవేరబోతుందనే ఆనందంలో మునిగితేలాడు విల్లే. నెలలు నిండాక ఒకరోజు నొప్పి తీవ్రతరమవడంతో సెప్టెంబర్ నెలలో ఎమెర్జీన్సీ సీ సెక్షన్ ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు వైద్యులు. ఈ విషయాన్నంతా సోషల్ మీడియాలో పంచుకున్న ఈ దంపతులకు ఆన్‌లైన్‌లోనే భారీగా ఆధాయం వచ్చిపడుతోందట.  ఈ బిడ్డకు జన్మనిచ్చేందుకు చాలా కష్టపడ్డానని చెబుతున్నాడు విల్లే. వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన ముద్దుల బిడ్డకు రోవన్ అనే పేరు పెట్టుకున్నారు. 

‘గర్భంతో ఉండగా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది నవ్వుకునేవాళ్లట. అందరూ వస్తువుని చూసినట్లు అది అని పిలిచేవారట. కానీ, వాటి గురించి బాధపడలేదని అన్నాడు. ఎందుకంటే మగాళ్లకు గర్భం దాల్చే అవకాశం ఉండదు కదా. నేను అప్పటికే మహిళగా మారిపోయాను’ అని చెప్పుకొచ్చాడు విల్లే.