woman passenger
Woman Passenger Flight : విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవించింది. ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 19న గర్భిణీ అయిన మహిళ టోక్యో సమీపంలోని సరిటా నుంచి దుబాయ్ కు ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తోంది. 12 గంటల విమాన ప్రయాణంలో ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి.
దీంతో ఎమిరేట్స్ విమాన సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర వైద్య సహాయం అందించారు. ఈ క్రమంలో విమానం గాలిలో ఉండగానే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఎమిరేట్స్ సంస్థ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపింది.
Frontier airlines: విమానంలో ప్రసవించిన మహిళ.. శిశువుకు ఏం పేరు పెట్టారో మీరు ఊహించగలరా?
మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పటికీ విమాన నిర్ణీత సమయానికే దుబాయ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినట్లు పేర్కొంది. అనంతరం తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత తమకు ముఖ్యమని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది.