×
Ad

Nobel Prize: సర్సర్లే ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ట్రంప్‌పై మీమ్స్‌.. పిచ్చ కామెడీ.. చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..

"నా నోబెల్‌ బహుమతి నాకు కావాలి" అంటూ ట్రంప్‌ ఏడుస్తున్నట్టు, ఆయనకు ఆ బహుమతి రాకపోవడంతో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నట్లు మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

Nobel Peace Prize 2025: మొత్తం ఏడు యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇవాళ నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. నోబెల్ శాంతి బహుమతి 2025 వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మచాడోకు దక్కింది.

ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ‘వెనిజులా ఐరన్ లేడీ’గా ప్రసిద్ధి చెందారు. టైమ్ పత్రిక ప్రకటించిన ‘ది 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2025’ జాబితాలో కూడా ఆమె పేరు ఉంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్‌నకు నోబెల్‌ శాంతి బహుమతి రాకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Also Read: ట్రంప్‌ ఆశలు ఆవిరి.. టాటా బైబై ఖతం.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ “నోబెల్‌” ఎందుకు రాలేదంటే?

ట్రంప్ కోపంతో ఉన్న ఫొటోలు, చిన్నపిల్లాడిలా నోబెల్‌ బహుమతి కావాలంటూ ఏడుస్తున్న మీమ్స్‌ కడుపుబ్బా నవ్విస్తుఉన్నాయి. హాస్యం, చమత్కారంతో నెటిజన్లు ట్రంప్‌పై చేస్తున్న పోస్టు వైరల్ అవుతున్నాయి.