Elon Musk
Elon Musk: టెస్లా సీఈఓ, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా నిత్యం పలురకాల పోస్టింగ్‌లతో హల్‌చల్ చేస్తుంటారు. గత ఏడాది ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న మస్క్ దానిని నష్టాల భారినుంచి బయటపడేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ట్విటర్‌ను తన హస్తగతం చేసుకున్న తరువాత కొద్దికాలానికే ట్విటర్‌లో దాదాపు 75శాతం మంది ఉద్యోగులను తొలగించి, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు మస్క్. పలు దేశాల్లోని ట్విటర్ కార్యాలయాల్లో వస్తువులనుసైతం వేలానికి పెట్టేస్తున్నాడు. తాజాగా ట్విటర్‌లో తన పేరును మస్క్ మార్చుకున్నాడు.
Elon Musk: ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ దెబ్బ.. డిసెంబర్‌లో 71 శాతం పడిపోయిన ఆదాయం
గతంలో ఎలాన్ మస్క్ పేరుతో ఉన్న తన ట్విటర్ ఖాతా పేరును ప్రస్తుతం ‘మిస్టర్ ట్వీట్’ అని మార్చుకున్నాడు. ఈ మేరకు మస్క్ ట్వీట్ చేస్తూ.. నా ట్విటర్ ఖాతాపేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నానని, కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్వీటర్ అనుమతించడం లేదంటూ స్మైలీ ఎమోజీతో పోస్టు చేశారు. ఆయన ప్రకటన నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. దీంతో వేలాది మంది నెటిజన్లు మస్క్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣
— Elon Musk (@elonmusk) January 25, 2023
మిస్టర్ ట్వీట్.. ట్విటర్‌ను కామెడీ ఛానల్‌గా మార్చేస్తున్నారా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఇది నిజంగా కామెడీ ఛానల్‌లానే ఉందంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. కానీ, మీరు మిగిలిన వారిలాగా బ్లూ టిక్ ను కోల్పోలేదు. ఎందుకో వివరించండి అంటూ మరో నెటిజన్ మస్క్ ను ప్రశ్నించారు. అయితే, ఇకనుండి నేను నా ఖాతా పేరును ఎలాన్ మస్క్ అని మార్చుకుంటా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యనించాడు. ఇలా నెటిజన్లు మస్క్ ట్వీట్ కు సరదాసరదా వ్యాఖ్యలతో రీట్వీట్లు చేస్తున్నారు.