Elon Musk: ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ దెబ్బ.. డిసెంబర్‌లో 71 శాతం పడిపోయిన ఆదాయం

ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన తర్వాత ప్రకటనకర్తలు ట్విట్టర్‌పై వెచ్చించే నిధుల్ని తగ్గించుకుంటున్నారు. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం గత డిసెంబర్‌లో 71 శాతం తగ్గిపోయింది. నవంబర్‌లో 55 శాతం ఆదాయం తగ్గింది.

Elon Musk: ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ దెబ్బ.. డిసెంబర్‌లో 71 శాతం పడిపోయిన ఆదాయం

Elon Musk: ట్విట్టర్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్థను నష్టాలబాట పట్టేలా చేస్తున్నాయి. మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ షేర్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఆదాయానికి సంబంధించి తాజాగా ఒక నివేదిక వెల్లడైంది.

Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని

‘స్టాండర్డ్ మీడియా ఇండెక్స్ (ఎస్ఎమ్ఐ)’ నివేదిక ప్రకారం.. ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన తర్వాత ప్రకటనకర్తలు ట్విట్టర్‌పై వెచ్చించే నిధుల్ని తగ్గించుకుంటున్నారు. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం గత డిసెంబర్‌లో 71 శాతం తగ్గిపోయింది. నవంబర్‌లో 55 శాతం ఆదాయం తగ్గింది. సాధారణంగా ఇది హాలిడే సీజన్ కాబట్టి, యాడ్స్ ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. కానీ, ఈసారి భిన్నంగా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. మార్కెట్లో అగ్ర స్థానంలో ఉన్న యాడ్ సంస్థలు ఈ మేరకు ట్విట్టర్‌పై చేసే ఖర్చుని తగ్గించుకున్నాయి. అయితే, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోంది. ప్రకటన సంస్థల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఏకే ఆంటోని తనయుడు

దీనిలో భాగంగా కొన్ని ఉచిత యాడ్స్ కూడా అందిస్తోంది. గతంలో తొలగించిన రాజకీయ పరమైన ప్రకటనలకు తిరిగి అవకాశం కల్పిస్తోంది. అలాగే ప్రకటన సంస్థలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు.. ఎక్కడ కోరుకుంటే అక్కడ యాడ్స్ పబ్లిష్ చేస్తోంది. ట్విట్టర్ రోజువారీ ఆదాయం కూడా 40 శాతం తగ్గింది. ప్రముఖ టాప్ బ్రాండ్లు కూడా ట్విట్టర్‌పై తక్కువగా ప్రకటనలిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే పూర్తిగా ప్రకటనల్ని తొలగించాయి. ఇలాంటి సంస్థల్లో ఆడి, ఫోర్డ్, హెచ్‌పి, డెల్, మెటా, కోకా కోలా, వెల్స్ ఫార్గో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలున్నాయి. టాప్ 100 సంస్థల్లో టాప్ 50 సంస్థలు కంపెనీకి దూరమయ్యాయి.