Viral Video : మొదటిసారి సముద్రాన్ని చూసి పసివాడి ఆనందం..అద్భుతాన్ని చూసినంత సంబరం..

మొదటిసారి సముద్రాన్ని చూసిన ఓ పసిపిల్లాడి మోములో ఆనందం అంతా ఇంతా కాదు. ఏదో అద్భుతాన్నిచూసినట్లుగా ఆ పిలల్ాడు వావ్..వావ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సముద్రం నుంచి చూపు తిప్పుకోకుండా అంటూన్న వీడియో వైరల్ గా మారింది.

Joy Of A Boy Seeing The Sea For The First Time

joy of a boy seeing the sea for the first time : పసివయస్సులో మొదటిసారి ఏది చూసినా ఆశ్చర్యంగా అద్భుతంగా కనిపిస్తుంది. చిన్నారులకు అదో వింత అనుభూతి. అలా తాము చూసిన మొదటి ఆనందాన్ని చిన్నారులు ఎప్పటికీ మరచిపోలేరు. వారి హృదయంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ ఆనంద క్షణాలు వారి పసి హృదయంలో పదిలంగా..అమూల్యంగా నిలిచిపోతాయి. అలా ఓ రెండేళ్ల పిల్లాడు మొదటిసారి ‘సముద్రాన్ని’ చూసినప్పుడు కలిగిన ఆనందం ఆమె పిల్లాడి మోములో కోటి కాంతుల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.

మొదటిసారి సముద్రాన్ని చూసిన ఆ పసిపిల్లాడి ముద్దులొలికే మోములో భావోద్వాన్ని నింపింది. ఏదో అద్భుతాన్నిచూసిన ఫీలింగ్ కలిగింది. వావ్..వావ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సముద్రం నుంచి చూపు తిప్పుకోకుండా అంటూనే ఉంటాడు. ఈ వీడియోను ఎంతోమంది చూసి ఆ పిల్లాడి అద్భుతమైన భావోద్వేగాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. ఆ పిల్లాడు సముద్రాన్ని చూసిన ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ఓ యూజర్..నేను బీచ్ కు వెళ్లిన ప్రతీసారి నాకు అంతే ఆనందం కలుగుతుందని రాశారు.