Bitcoins : 7500 బిట్ కాయిన్లను చెత్తబుట్టలో పడేసిన భార్య..నాసా శాస్త్రవేత్తలతో వెతికిస్తున్న భర్త..

ఓ వ్యక్తి 3404 కోట్లకు సమానమైన 7500 బిట్ కాయిన్లను పొరపాటున చెత్తబుట్టలో పడేసింది అతని భార్య. దాన్ని వెతకటానికి ఆ భర్త ఏకంగా నాసా శాస్త్రవేత్తల్ని రంగంలోకి దింపాడు.

UK Man NASA linked experts to find hard drive with 7,500 bitcoins : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా Cryptocurrency మాటే. ఇక రాబోయే కాలంలో ఇక కరెన్సీ నోట్లు ఉండవా అనేంతగా Cryptocurrency హల్ చల్ చేస్తోంది. ఈ కరెన్సీకి ఇంత స్థాయిలో ఆదరణ రావడానికి మెయిన్ కారణ. వాటికి టాక్స్ ఫ్రీ,భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి చేస్తారు. వాటిని ఉపయోగించేవారు క్రిప్టోకరెన్సీలను ఎన్ క్రిప్టెడ్ సెక్యూరిటీతో భద్రంగా ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు. ఈక్రమంలో యూకేకు చెందిన జేమ్స్ హూవెల్స్ భార్య చేసిన చిన్న పొరపాటు అతడికి చుక్కలు చూపెట్టింది. అసలు విషయం ఏమిటంటే..

బిట్ కాయిన్ల హార్డ్ డిస్క్ చెత్త బుట్టలో పడేసిన భార్య..
యూకేకు చెందిన 36 యేళ్ల జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి ఏకంగా 7500 బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు. 340 మిలియన్ల (యూకే పౌండ్స్) విలువ చేసే బిట్ కాయిన్లను అతని మాజీ భార్య చేసిన పొరపాటు తో 7500 బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్ కాయిన్ల హార్డ్ డిస్క్ చెత్తబుట్టలో పడేసింది. ఈ హార్డ్ డిస్క్ వెతకడం కోసం జేమ్స్ ఏకంగా నాసా శాస్త్రవేత్తల్ని రంగంలోకి దింపాడు. వాటిని గుర్తించటానికి నాసా శాస్త్రవేత్త సహాయం తీసుకున్నాడు. తన అదృష్టాన్ని పరిక్షించుకోవటానికి..

Read more : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్‌ తయారీ ఘనత

జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని బిలియనీర్ అవ్వకుండా అపేసింది. బిట్ కాయిన్స్ హవా కొనసాగుతున్న ఈ సమయంలో పోగొట్టుకున్నవాటిని తిరిగి దక్కించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఆ 7500 Bitcoins విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 3404 కోట్లకు సమానం. భార్య పారేసిన ఆ హార్డ్ డిస్క్ దక్కించుకోవానికి జేమ్స్ అమెరికా ఒన్ ట్రాక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోగొట్టుకున్న కరెన్సీని దక్కించుకోవటానికి నానా తిప్పలు పడుతున్నాడు జేమ్స్.

వీరు గతంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమిపై కూలి పోయినప్పుడు NASAకు సహాయాన్ని అందించారు. దీంతో జేమ్స్ శాస్త్రవేత్తల సహాయంతో పోగొట్టుకున్న బిట్స్ కాయిన్స్ హార్డ్ డిస్క్ దక్కించుకోవాటానికి యత్నిస్తున్నాడు. ఈ హార్డ్ డిస్క్ వెతుకులాటలో వన్ ట్రాక్ విజయవంతమైతే దానిని క్రాక్ చేస్తే..జేమ్స్ రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోతాడు. కానీ..అక్కడి స్థానిక సౌత్ వేల్స్ పోలీసులు హార్డ్ డిస్క్ వెతికేందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు.

Read more : Crypto currency Sharia : క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు..కరెన్సీపై నిషేధం విధించిన దేశం

కాగా..పోగొట్టుకున్న ఆ హార్డ్ డిస్క్ కు ఏమాత్రం పాడవ్వకుండా ఉంటే దాన్ని దక్కించుకున్నా ఫలితం ఉంటుంది. అది పగిలిపోకుండా ఉంటే బిట్ కాయిన్ డేటాను పొందే అవకాశాలున్నాయని..హార్డ్ డిస్క్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే దాదాపు 90 శాతం డేటాను పొందవచ్చని అంటోంది అమెరికా ఒన్ ట్రాక్ కంపెనీ.

ట్రెండింగ్ వార్తలు