Viral Video: రోమాలు నిక్కపొడుచుకునే వీడియో.. ఈ సాహసం చూసినా చాలు!

6,522 మీటర్ల ఎత్తులో అంటే సహజంగా ఆక్సిజన్ అందడమే కష్టం. అలాంటిది రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లను కలిపే మెటల్‌ ప్లాంక్‌పై నడక అంటే ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు..

Viral Video

Viral Video: 6,522 మీటర్ల ఎత్తులో అంటే సహజంగా ఆక్సిజన్ అందడమే కష్టం. అలాంటిది రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లను కలిపే మెటల్‌ ప్లాంక్‌పై నడక అంటే ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు.. అసలు సాహసం చేయడానికి కూడా ఉక్కు లాంటి గుండె కావాలి. అసలు కళ్ళు తెరిచి ఆ రెండు హాట్ బెలూన్స్ మధ్య ప్లాంక్ మీద నడవడమే గొప్ప సాహసం అంటే కళ్ళకు గంతలు కట్టుకొని నడవడం మాములు విషయం కాదు.

అందుకే గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ ఈ సాహసాన్ని నమోదు చేయడమే కాకుండా పాత వీడియోను మరోసారి షేర్ చేసి ప్రపంచానికి సాహసాన్ని గుర్తుచేసింది. 17 ఏళ్ల క్రితం నాటి ఓ సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో బ్రిటన్‌కు చెందిన మైక్ హోవార్డ్ అనే వ్యక్తి 6,522 మీటర్ల ఎత్తులో రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లను కలిపే మెటల్‌ ప్లాంక్‌పై తీగల సాయంతో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

2004 సెప్టెంబ‌ర్ 1న తీసిన ఈ వీడియో అప్పట్లోనే సంచలనం కాగా తాజాగా సోషల్ మీడియాలో మళ్లీ భారీగా స్పందిస్తున్నారు. హోవార్డ్‌ ధైర్య సాహసాలను మెచ్చుకోవడంతోపాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూస్తున్నంతసేపు తీవ్ర ఉత్కంఠ మాత్రమే కాదు.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.