UK Married A Tree : చెట్టును పెళ్లి చేసుకున్న యువతి, తమ బంధం గట్టిగానే ఉందంటోంది

తమ బంధం ఇంకా గట్టిగానే ఉందని చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు చెట్టును సందర్శిస్తానని చెబుతోంది. క్రిస్మస్ కార్డులపై విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్ అని...

UK Married A Tree : చెట్టును పెళ్లి చేసుకున్న యువతి, తమ బంధం గట్టిగానే ఉందంటోంది

Uk Married A Tree

Updated On : December 21, 2021 / 7:02 PM IST

Kate Cunningham : కొంతమంది వింతగా, వినూత్నంగా వ్యవహరిస్తుంటారు. వివాహ విషయంలో కూడా భిన్నంగా ఉంటుంటారు. కుక్కను, రోబోను, బొమ్మలను..ఇతర వాటిని పెళ్లి చేసుకుంటూ..వార్తల్లో నిలుస్తుంటారు. దీనికి కారణం కూడా వారు చెబుతుంటారు. తాజాగా ఓ యువతి చెట్టును పెళ్లి చేసుకుంది. ఈఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకే..మెర్సీ సైడ్ లోని సెఫ్టన్ లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్ హోమ్ నివాసం ఉంటున్నారు. 2019లో చాలా సంవత్సరాలున్న చెట్టును వివాహమాడింది. కేట్ వివాహానికి ఆమె కుటుంబసభ్యులు మద్దతివ్వడం విశేషం.

Read More : Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు

ఈ విషయంలో ఈమె ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. తమ బంధం ఇంకా గట్టిగానే ఉందని చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు చెట్టును సందర్శిస్తానని, రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆమె అప్పుడు ఆ విధంగా చేశారు. చాలా ఏళ్ల క్రితం..ల్యాండ్ క్లియరెన్స్ కోసం చట్టవిరుద్దంగా..చెట్టును నరకడాన్ని వ్యతిరేకించి..చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శమని చెబుతున్నారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ రాబోతోందని..ఈ చెట్టుతో కలిసి మూడో పండుగ జరుపుకుంటానని వెల్లడిస్తున్నారు. క్రిస్మస్ కార్డులపై విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్ అని సంతకాలు కూడా చేశారు.