Smart Ration Cards: నేటి నుంచే.. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ప్రత్యేకతలు ఇవే..
ఇది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

Smart Ration Cards: ఏపీలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనుంది ప్రభుత్వం. మొత్తం 4 విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.
1.46 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం వీటిని పంపిణీ చేయనుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. గతం కన్నా పూర్తి భిన్నంగా కొత్త కార్డులు ఉండనున్నాయి. వీటిపై వివరాలు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేసింది ప్రభుత్వం. ఇది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా స్మార్ట్ కార్డులను ఇంటి వద్దే అందించనున్నారు. ఇవి పూర్తిగా ఉచితం అని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక హంగులతో కొత్త కార్డులను ప్రభుత్వం డిజైన్ చేసింది.
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద రాజకీయ నేతల ఫోటోలు ఉండవు. కేవలం కుటుంబసభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి.
Also Read: మరో అల్పపీడనం..! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల్లో కుండపోత వానలు..
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద రాజకీయ నేతల ఫోటోలు ఉండవు. కేవలం కుటుంబసభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి.
మొత్తం నాలుగు విడతల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 30వ తేదీ నుండి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుండి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
సెప్టెంబర్ 15 నుండి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.