Matt Hancock : పీఏకి ముద్దు.. మంత్రి పదవి పోయింది

ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో లీక్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఈ ఫొటో వ్యవహారంపై స్పందించిన సదురు మంత్రి అందులో ఉన్నది తానేనని అంగీకరించాడు. ఫొటో నిజమైనదేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు మంత్రి పదవికి రాజీనామా కూడా చేశాడు.

Matt Hancock

Matt Hancock : ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో లీక్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఈ ఫొటో వ్యవహారంపై స్పందించిన సదురు మంత్రి అందులో ఉన్నది తానేనని అంగీకరించాడు. ఫొటో నిజమైనదేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు మంత్రి పదవికి రాజీనామా కూడా చేశాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. ఆ ఫొటోలో ఉన్నది యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హన్‌కాక్.

ద సన్ టాబ్లాయిడ్ మంత్రిగారి ముద్దు ఫోటోను కవర్ పేజీ బ్యానర్ ఐటమ్‌గా ప్రచురించింది. ఈ ఫొటో మే 6 నుంచి 11 మధ్య కాలంలో తీసిందని.. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయలేదని తెలిపింది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారికి హగ్స్ ఇవ్వడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని వివరించింది. ఆ ఫొటోలో ఉన్న మహిళను హన్‌కాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడనే ఆరోపణలూ ఉన్నాయి. గత నెలలోనే ఆమెను హన్ కాక్ తన సహాయ అధికారిగా నియమించుకున్నాడట.

మంత్రిగారి ముద్దుల ఫొటో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. దీంతో స్పందించిన హన్‌కాక్.. ఆ ఫొటో తనదేనని అంగీకరించాడు. తాను సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయానని.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని ఒప్పుకుని అందుకుగాను ప్రజలకు క్షమాపణ చెప్పారు. అలాగే మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ కు లేఖ రాశారు.