Stroke In Younger Adults : యువతకే స్ట్రోక్ ముప్పు అధికం.. యూకే అధ్యయనంలో వెల్లడి
యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు యూకే అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన 94వేల మందిపై ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. 55 ఏళ్ల లోపు యువకుల్లో స్ట్రోక్ ముప్పు 67శాతం ఉన్నట్లు తేల్చారు.

stroke in younger adults
Stroke In Younger Adults : యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు యూకే అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన 94వేల మందిపై ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. 55 ఏళ్ల లోపు యువకుల్లో స్ట్రోక్ ముప్పు 67శాతం ఉన్నట్లు తేల్చారు. అదే సమయంలో 55 ఏళ్లు దాటిన వారికి కేవలం 15శాతం మాత్రమే ముప్పు ఉన్నట్లు కనుగొన్నారు.
Brain Stroke : అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ తో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
ముఖ్యంగా ఉద్యోగం చేసే యువత ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారని గుర్తించారు. రక్త ప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితినే స్ట్రోక్ అంటారు. మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే తీవ్ర నష్టం కల్గుతుంది.