UK Warns Citizens : పాకిస్థాన్ దేశానికి వెళ్లొద్దు…పౌరులకు యూకే హెచ్చరిక

యునైటెడ్ కింగ్‌డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల యూకే పౌరులు ఆ దేశానికి వెళ్లవద్దని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ట్రావెల్ సలహా జారీ చేసింది....

UK Warns Citizens

UK Warns Citizens : యునైటెడ్ కింగ్‌డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల యూకే పౌరులు ఆ దేశానికి వెళ్లవద్దని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ట్రావెల్ సలహా జారీ చేసింది.

తీవ్రవాద ముప్పు ఉంది…జర జాగ్రత్త

ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ ప్రధాన నగరాలతోపాటు పాకిస్థాన్ దేశ్యాప్తంగా తీవ్రవాదం, కిడ్నాప్ లు, మతపరమైన హింసకు పాల్పడే ముప్పు ఉందని యూకే పేర్కొంది. విదేశీ, కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం (FCDO) దేశంలోని బ్రిటిష్ నివాసితులు, ప్రయాణికుల కోసం తాజాగా సూచనలను అందించింది. (UK Warns Citizens Against Travelling To Pak) పాకిస్థాన్ దేశంలో విదేశీయులు, ప్రత్యేకించి యూకే పౌరులు టార్గెట్ చేయవచ్చని, అందుకే తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని యూకే సూచించింది.

ఈ ప్రాంతాల్లో యూకే పౌరులు సందర్శించవద్దు…

ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బౌజర్, మొహమ్మంద్, ఖైబర్, ఒరాక్జాయ్, కుర్రం, ఉత్తర వజీరిస్థాన్, దక్షిణ వజీరిస్థాన్ జిల్లాల్లో యూకే పౌరులు సదర్శించవద్దని యూకే కోరింది. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని చర్సద్దా, కోహట్, ట్యాంక్, బన్నూ, లక్కీ, డేరా ఇస్మాయిల్ ఖాన్, స్వాత్, బునేర్, లోయర్ దిర్ జిల్లాలకు వెళ్లవద్దని యూకే సలహా ఇచ్చింది. పెషావర్ నగరం ఎన్ 45 రహదారిపై ప్రయాణించవద్దని యూకే తన దేశ పౌరులకు సూచించింది.

సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లండి…

బలూచిస్తాన్, చిత్రాల్, బలూచిస్తాన్ ప్రావిన్స్ జిల్లా అంచు వరకు మర్దాన్ రింగ్-రోడ్డు మార్గంలో వెళ్లవద్దని కోరింది. పాకిస్థాన్ దేశంలో ఇటీవల రాజకీయ ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయని, అవి హింసాత్మకంగా మారవచ్చని యూకే చెప్పింది. పాక్ దేశంలో నిరసన ప్రదేశాలకు దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని బ్రిటీష్ జాతీయులకు యూకే ట్రావెల్ సలహా ఇచ్చింది.

జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో దాడులు జరగవచ్చు…

మార్కెట్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, హైకింగ్ ట్రయల్స్, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా రవాణా, పాఠశాలలు, విద్యాసంస్థలతో సహా అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలు, తగిన భద్రత లేని ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశముందని యూకే హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బ్రిటీష్ పౌరులకు యూకే సూచించింది.

ప్రకృతి వైపరీత్యాల పట్ల జాగ్రత్త వహించండి

పాక్ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు సంభవించే ప్రమాదాన్ని యూకే ప్రస్తావించింది. అటువంటి సంఘటన జరిగినప్పుడు భద్రతా విధానాల గురించి తమ పౌరులు తెలుసుకోవాలని యూకే కోరింది.