Ukraine Russia War: ఒట్టి చేతులతో భారీ బాంబును నిర్వీర్యం చేసిన యుక్రెయిన్ బాంబు స్క్వాడ్: వీడియో

యుక్రెయిన్ లో రష్యా జారవిడిచిన ఒక బాంబును యుక్రెయిన్ బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Ukraine Russia War: యుక్రెయిన్ లో రష్యా విధ్వంసం కొనసాగుతుంది. రష్యా సైన్యం భీకరమైన దాడులతో యుక్రెయిన్ నగరాలను నేలమట్టం చేస్తుంది. రష్యా దాడులను తిప్పికొడుతూ యుక్రెయిన్ సైన్యం తమ దేశాన్ని రక్షించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆకాశం నుంచి భారీ బాంబులు రాలి పడుతున్నా భయపడకుండా.. ధైర్యంగా పోరాడుతున్నారు యుక్రెయిన్ సైనికులు. యుద్ధం ప్రారంభం నాటి నుంచి యుక్రెయిన్ సైనికులు రష్యాను ఎదుర్కొంటున్న తీరు..అటు రష్యాతో పాటు ఇటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రష్యా నుంచి ఎదురౌతున్న భీకర దాడులను తిప్పికొడుతూ..సాహో అనిపించుకుంటున్నారు యుక్రెయిన్ సైనికులు.

Also read: Russia Ukraine War: మానవతా మార్గాల ద్వారా 35 వేల మంది యుక్రెయిన్ పౌరుల తరలింపు

తాజాగా యుక్రెయిన్ లో రష్యా జారవిడిచిన ఒక బాంబును యుక్రెయిన్ బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాంబు గనుక పేలినట్లైతే.. సమీపంలోని భవనాలు క్షణాల వ్యవధిలో నేలమట్టం అయ్యేవి. అయితే బాంబు పేలకుండా భూమిపై పడిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ ఒట్టి చేతులతో ఆ భారీ బాంబును నిర్వీర్యం చేశాడు. ఒక వ్యక్తి నీరు పోస్తుండగా.. మరొకరు ఎంతో జాగ్రత్తగా.. బాంబును డిఫ్యూజ్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారడంతో యుక్రెయిన్ సైనికుల సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంతో గుండె ధైర్యం ఉంటేగాని ఇలా తెగువ చూపరంటూ కొనియాడుతున్నారు.

Also read: Gun Shooting in Mexico : డ్రగ్స్ వ్యాపారం చేసే ఇంట్లో కాల్పులు..ముగ్గురు మహిళలు సహా 9మంది మృతి

ట్రెండింగ్ వార్తలు