Russia Ukraine War: మానవతా మార్గాల ద్వారా 35 వేల మంది యుక్రెయిన్ పౌరుల తరలింపు

ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా.. యుద్ధ దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అటు మాస్కో వర్గాలు, ఇటు కీవ్ వర్గాలు భావించాయి

Russia Ukraine War: మానవతా మార్గాల ద్వారా 35 వేల మంది యుక్రెయిన్ పౌరుల తరలింపు

Ukraine

Russia Ukraine War: యుక్రెయిన్ లో రష్యా బలగాల బాంబుల మోత కొనసాగుతుంది. రెండు వారాలుగా యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా సైన్యం..ఆయా నగరాల్లోని ఆసుపత్రులు, ఇతర నివాస గృహాలపైనా దాడులు చేస్తున్నారు. రష్యా సైన్యం దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా రాకెట్ లాంచర్ దాడులతో యుక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఒక్కొక్కరిగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా సామాన్య ప్రజలపై రష్యా దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల తరలింపుపై ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా.. యుద్ధ దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అటు మాస్కో వర్గాలు, ఇటు కీవ్ వర్గాలు భావించాయి. బుధవారం దాడులకు విరామం ప్రకటించిన ఇరు దేశాలు.. ప్రజల తరలింపుపై సూచనలు చేశాయి.

Also read: Gun Shooting in Mexico : డ్రగ్స్ వ్యాపారం చేసే ఇంట్లో కాల్పులు..ముగ్గురు మహిళలు సహా 9మంది మృతి

ప్రజలను తరలించడంలో స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుమీ, ఎనర్హోదర్, కీవ్ నగరాలు మీదుగా ఏర్పాటు చేసిన మూడు “మానవతా మార్గాల ద్వారా” బుధవారం నాడు 35,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు యుక్రెయిన్ అధ్యక్షడు జెలెన్స్కీ ప్రకటించారు. గురువారం కూడా తరలింపులు కొనసాగుతాయని తాను ఆశిస్తున్నానని, మారియుపోల్, ఆగ్నేయంలోని వోల్నోవాఖా మరియు తూర్పు ఉక్రెయిన్‌లోని ఇజియం మీదుగా మరో మూడు మార్గాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయని జెలెన్స్కీ పేర్కొన్నారు.

Also read: Russia Ukraine war: యుక్రెయిన్ కు అండగా బ్రిటన్.. మరిన్ని ఆయుధాలు సరఫరా

2 లక్షల 50 వేల మంది జనాభా కలిగిన సుమీ నగరం నుంచి ఇప్పటివరకు 48 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని, యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు యుక్రెయిన్ నగరాలను ఆక్రమించిన రష్యా సైన్యం.. ఆయా నగరాల్లోని ఆసుపత్రులను, ఇతర కమ్యూనిటీ హాళ్లపైనా దాడులకు తెగబడింది. బుధవారం రష్యా సైన్యం ఒక పిల్లల ఆసుపత్రిని నేలమట్టం చేసాయి. ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో 1200 మంది పౌరులు మృతి చెందినట్లు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.