Russia – Ukraine War: రష్యా బలగాలను అడ్డుకునేందుకు మైన్లతో ప్రాణత్యాగం చేసుకున్న సైనికుడు

ప్రాణాలకు తెగించి మాత్రమే కాకుండా.. ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధమయ్యారు సైనికులు. ఈ క్రమంలోనే యుక్రెయిన్ ఆర్మీలోని వాలోడిమీరోవిచ్ స్కకూన్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి..

Russia – Ukraine War: యుక్రెయిన్ ఆర్మీ రష్యా బలగాలను తమ గడ్డపై అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ప్రాణాలకు తెగించి మాత్రమే కాకుండా.. ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధమయ్యారు సైనికులు. ఈ క్రమంలోనే యుక్రెయిన్ ఆర్మీలోని వాలోడిమీరోవిచ్ స్కకూన్ అనే ఆర్మీ ఇంజినీర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

యుక్రెయిన్ లోకి అడుగుపెట్టబోయే క్రిమీన్ ఇస్తమస్ ప్రాంతంలో ప్రమాదాన్ని సృష్టించి రష్యాను అడ్డుకోబోయాడు.

జెనిచెస్కీ బ్రిడ్జ్ ను మెరైన్లతో పేల్చడంలో స్కకూన్ కీలకంగా వ్యవహరించాడు. మైన్ పేల్చేముందు బ్రిడ్జి మీద నుంచి పరుగుతీయాల్సి ఉంది. ఆ ప్రమాదంలో బతికే అవకాశాలు తక్కువని తెలిసినా.. సిద్ధమయ్యాడు.

Read Also : రష్యా సైన్యం దూసుకొస్తున్నా.. కీవ్‌ వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉత్తేజ పరుస్తున్న జెలెన్‌స్కీ

‘అతని హీరోయిజంతో కూడిన ప్రదర్శన శత్రుమూకల్లో భయం పుట్టించింది. కొంతసేపటి వరకూ బలగాల్లో మార్పులు జరిగాయి’ అని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

Ukraininian

స్కకూన్ మరణం రష్యన్ బలగాలను అడ్డుకునేందుకు మిగిలిన సైనికులకు కాస్త సమయాన్ని ఇచ్చింది. అతని సాహసేపేతమైన నిర్ణయానికి తగ్గట్టు అవార్డు పొందుతాడని మెరైన్ కమాండ్ సత్కరిస్తుందంటూ ప్రశంసించారు జనరల్.

ఆ తర్వాత.. ”ప్రాణాలున్నంత వరకూ పోరాడతాం, ప్రాణాలున్నంత వరకూ పోరాడతాం. రష్యా ఆక్రమితదారులారా.. మీ కాలి కింద నేల ఎప్పటికీ మండుతూనే ఉంటుందని గుర్తుంచుకోండి’ అంటూ ఆర్మీ స్టాఫ్ పోస్టుచేశారు.

Read Also : యుక్రెయిన్-రష్యా వార్.. జెలెన్‌స్కీని రక్షించేందుకు రంగంలోకి అమెరికా

ట్రెండింగ్ వార్తలు