Ukraine President : రష్యా సైన్యం దూసుకొస్తున్నా.. కీవ్‌ వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉత్తేజ పరుస్తున్న జెలెన్‌స్కీ

యుద్ధంలో రష్యాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని జెలెన్‌స్కీకి తెలుసు... ఎప్పుడైతే నాటో దేశాలు చేతులెత్తేశాయో అప్పుడే ఓటమి తప్పదని అర్థమైంది. అయినా సైనికులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.

Ukraine President : రష్యా సైన్యం దూసుకొస్తున్నా.. కీవ్‌ వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉత్తేజ పరుస్తున్న జెలెన్‌స్కీ

Zelenskyy (1)

Ukrainian President Zelenskyy : అధ్యక్షుడంటే ఎలా ఉండాలి.. విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి.. అంటే నాలా ఉండాలంటున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రైటో రాంగో తన నిర్ణయాలు యుక్రెయిన్‌ను యుద్ధరంగంలోకి నడిపించాయి. ఈ పరిస్థితుల్లో మాత్రం అతను నిజమైన నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడో అధ్యక్ష భవనంలో దాక్కుని ఆదేశాలు జారీ చేయడం లేదు. ప్రజల ముందే తిరుగుతున్నారు. వారి ముందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్షుడు కనబడకపోతే ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే ఆ పరిస్థితి రాకుండా జెలెన్‌స్కీ జాగ్రత్త పడుతున్నారు.

యుద్ధంలో రష్యాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని జెలెన్‌స్కీకి తెలుసు… ఎప్పుడైతే నాటో దేశాలు చేతులెత్తేశాయో అప్పుడే ఓటమి తప్పదని అర్థమైంది. అయినా సైనికులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు వదలడం కంటే అదృష్టం ఇంకేముంది అంటూ కీవ్‌ వీధుల్లో ప్రసంగాలు ఇస్తున్నారు. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి. సైనికుల్లో దేశభక్తిని పెంచుతోంది. పైగా సైనిక స్థావరాల్లో జెలెన్‌స్కీ పర్యటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రష్యా మిస్సైల్స్‌ దాడులు జరుగుతాయని తెలిసినా, రక్షణ లేదని తెలిసినా ఏమాత్రం భయపడలేదు. పోతేపోనీ అంటూ కదన రంగంలోకి దూకారు. స్వయంగా ఆయుధం పట్టారు.

Zelenskyy : నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’.. అమెరికాకు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంటర్

మరోవైపు రష్యన్లకు కూడా జెలెన్‌స్కీ సందేశాలు ఇస్తున్నారు. తమపై జరుగుతున్న దాడిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేలా చూస్తున్నారు. జెలెన్‌స్కీ పారిపోయాడంటూ ఓవైపు రష్యా సైన్యం ప్రచారం చేస్తుంటే జెలెన్‌స్కీ మాత్రం కీవ్‌ రోడ్లపై ఏ మాత్రం భయం లేకుండా తిరుగుతున్నారు. నేనెక్కడికీ పారిపోలేదు. ఇక్కడే ఉన్నా అని చెబుతున్నారు. నిజానికి కీవ్‌లో రష్యా బలగాలు ప్రవేశించాయి. ఏ క్షణమైనా అధ్యక్ష భవనాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.

మరోవైపు రష్యా స్పెషల్‌ టీమ్స్‌ కూడా రంగంలోకి దిగాయి. జెలెన్‌స్కీ ఆచూకీ తెలిస్తే చాలు వెంటనే లిఫ్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తేడా వస్తే లేపేయడానికి కూడా వెనకాడవు. పుతిన్ అసలు టార్గెటే జెలెన్‌స్కీ. అధ్యక్ష పదవి నుంచి దించేసి తనకు అనుకూలమైన వ్యక్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టాలన్నది పుతిన్ వ్యూహం. అయినా అతను ఏ మాత్రం తగ్గడం లేదు. నేను మోనార్క్‌ని అంటూ ధైర్యంగా తిరిగేస్తున్నారు.