Zelenskyy : ‘నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’.. అమెరికాకు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంటర్

దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్‌లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.

Zelenskyy  : ‘నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’.. అమెరికాకు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంటర్

Volodymyr Zelenskyy

Zelenskyy counter to America : ‘నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’… అమెరికాకు యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇది. తనను దేశం నుంచి తప్పిస్తానన్న ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధానికి దారితీసే పరిస్థితులు సృష్టించి…తీరా యుద్ధం మొదలయ్యాక ఆయుధాలు, బలగాలు పంపకుండా రష్యాపై ఆంక్షలు, ఐక్యరాజ్యసమితిలో తీర్మానాలతో సరిపెట్టిన అమెరికాకు గట్టి ఝలక్ ఇచ్చారు. బైడన్‌కు జెలెన్ స్కీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. తనను యుక్రెయిన్‌ నుంచి తప్పిస్తానన్న అమెరికాకు కౌంటర్‌ ఇచ్చారు. ఆఫర్లు కాదు ఆయుధాలు ఇవ్వండంటూ జెలెన్‌స్కీ అమెరికాకు సమాధానమిచ్చారు.

దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్‌లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా జెలన్‌స్కీకి ఆఫర్ ఇచ్చింది. జెలన్‌స్కీకి ప్రాణ హాని ఉందని అనుమానిస్తున్న అమెరికా ఆయన్ను దేశం దాటించేందకు…ప్రత్యేక బలగాలు పంపుతామని ప్రకటించింది. యూరప్‌లోని ఏదో ఓ ప్రాంతానికి ఆయన్ను సురక్షితంగా తరలిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌ తనకొద్దన్నారు జెలెన్‌స్కీ. కీవ్‌లో ఉంటానని తేల్చిచెప్పారు. మరోవైపు యుక్రెయిన్‌కు మరో విడత యుద్ధసాయానికి సంబంధించిన మెమెరాండంపై బైడన్ సంతకం చేశారు.

Indians Ukraine : యుక్రెయిన్‌లో భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు

యుక్రెయిన్‌కు బలగాలు తరలించాలని, యుక్రెయిన్‌కు మద్దతుగా పోరాడాలని ఓ పక్క జెలెన్‌స్కీ వేడుకుంటోంటే..అదేమీ పట్టించకోకుండా గతంలోలా..యుద్ధసహాయంపై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. రక్షణ ఆయుధాలు, సర్వీసులు, మిలటరీ ఎడ్యుకేషన్, శిక్షణ కోసం యుక్రెయిన్‌కు తక్షణ సాయం కింద భారీ మొత్తం ప్రటించింది. 550 మిలియన్ డాలర్ల సాయానికి సంబందించిన మెమరాండంపై బైడన్ సంతకం చేశారు.

తప్పొప్పుల సంగతి పక్కన పెడితే…యుద్ధం వేళల్లో ఓడిపోయే స్థితిలో ఉన్న దేశాల్లో తరచుగా జరిగే ఘటన….రాజధానిలోకీ శతృబలగాలు ప్రవేశించగానే…దేశం విడిచి పారిపోవడం. చరిత్రలోనూ, వర్తమానంలోనూ జరిగింది ఇదే. ఎంతమంది సైనికులు, సాధారణ పౌరులు చనిపోయినా కానీ…అధ్యక్షునికి మాత్రం ఏమీ కాకూడదు. ఆయన, ఆయన కుటుంబం సురక్షితంగా ఉండాలి. యుద్ధం నుంచి క్షేమంగా తప్పించుకోవాలి. ప్రాణాలతో బయటపడాలి. అందరూ ఆలోచించేది ఇదే. కానీ యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ తాను అలాంటి తరహా కాదని ఇప్పటికే నిరూపించుకున్నారు.

US Special Team : యుక్రెయిన్-రష్యా వార్.. జెలెన్‌స్కీని రక్షించేందుకు రంగంలోకి అమెరికా

శత్రువుల మొదటి టార్గెట్ తానేనని చెప్పిన జెలెన్‌స్కీ…వారి చేతికి చిక్కితే ప్రాణం పోతుందని తెలిసినా వెన్నుచూపడం లేదు. ఓ సాధారణ సైనికుడిలా రష్యా బలగాలతో యుద్ధక్షేత్రంలో వీరోచితంగా పోరాడుతున్నారు. ఆయనంతట ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడమే కాదు….అమెరికా ఇచ్చిన ఆయాచిత ఆఫర్‌ను సైతం తిరస్కరించారు.