Nuclear Power Plant Europe's Largest Nuclear Power Plant On Fire As Russia Attacks (1)
Ukraine Nuclear Plants : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై తొమ్మిదవ రోజు కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం దాడి చేసింది. జప్రోజహియ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా రాకెట్లతో దాడులు చేసింది. రష్యా దాడులతో యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. అణుయుద్ధం ప్రమాదపు అంచులో యుక్రెయిన్ ముప్పును ఎదుర్కోబోతోంది. ప్రస్తుతానికి అణు విద్యుత్ ప్లాంట్‌కు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ ప్రమాదం అంచునా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడులకు పాల్పడిందని జెలెన్ స్కీ మండిపడుతున్నారు. ప్రస్తుతానికి రేడియేషన్ లెవల్ సాధారణంగానే ఉందని ఆయన అన్నారు. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడిచేసిన మొదటి దేశం రష్యానే అంటూ జెలెన్ స్కీ మండిపడుతున్నారు.
మరోవైపు.. రష్యా దాడుల్లో న్యూక్లియర్ ప్లాంట్ పేలితే భారీ ప్రమాదమని యుక్రెయిన్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేశారు. న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడికి సంబంధించిన వివరాలను బైడెన్ అడిగి తెలుసుకున్నారు. యుక్రెయిన్ అణు ప్లాంట్‌పై రష్యా దాడిని అమెరికా, బ్రిటన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో జప్రోజహియాలో మిలటరీ ఆపరేషన్స్ వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. రష్యా రాకెట్ దాడుల్లో ఒకవేళ న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతింటే మొత్తం యూరప్, రష్యాపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశానికి బ్రిటన్ పిలుపునిచ్చింది. న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి సరికాదని ఐఏఈఏ తీవ్రంగా ఖండించింది.
Nuclear Power Plant Europe’s Largest Nuclear Power Plant On Fire As Russia Attacks
Ukraine Nuclear Plants : అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై ఆందోళన..
మరోవైపు.. యుక్రెయిన్‌లో రష్యా దాడులతో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళన రోజురోజుకీ ఎక్కువుతోంది. ఇప్పటికే రష్యా దాడులో అణు విద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని న్యూక్లియర్ నిపుణులు హెచ్చరించారు. యుక్రెయిన్‌లో చెర్నోబిల్ ఘటన పునరావృతమయ్యే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లోని అణు విద్యుత్తు కేంద్రాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే యుద్ధం జరుగుతుండటంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణు కేంద్రాల మధ్య యుద్ధం కొనసాగడం చాలా ప్రమాదకరమని అంటున్నారు. అయితే ఈ అణు రియాకర్లు చాలా ఏళ్ల క్రితమే నిర్మించారు. యుక్రెయిన్ సైతం అణు రియాక్టర్ల రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు ఎలాంటి దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెర్నోబిల్‌లోని 4 అణు రియాక్టర్లలో 1986లో ఒక రియాక్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో యూరప్ మొత్తం విధ్వంసాన్ని సృష్టించింది. రేడియేషన్ ప్రభావంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో చెర్నోబిల్ ప్రమాదం ఒకటిగా నిలిచింది. సుదీర్ఘ కాలంపాటు కొన్ని ప్రాంతాలు ఈ రేడియేషన్ ప్రభావానికి గురయ్యాయి. అక్కడి ప్రజల్లో చాలామందికి రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వ్యాధుల బారినపడ్డారు. ఇప్పటికీ కజమా చెర్నోబిల్ ప్రాంతంలో రేడియేషన్ తీవ్రత అధికంగానే ఉందని అంటున్నారు.