Ukraine’s President Zelensky condemns Putin
Christmas Day Attack : క్రిస్మస్ రోజున రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. బాలిస్టిక్ క్షిపణులతో సహా 70కి పైగా క్షిపణులను, 100కు పైగా డ్రోన్లతో రష్యా దాడులకు పాల్పడటంపై ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు.
క్రిస్మస్ సందర్భంగా రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్‌ను భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌పై వందలాది వైమానిక దాడులు చేసింది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రష్యా సైన్యం భారీ క్షిపణి, డ్రోన్లతో దాడికి దిగింది. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ 59 రష్యన్ క్షిపణులను, 54 డ్రోన్‌లను గాలిలోనే ధ్వంసం చేసింది.
రష్యా దాడి అమానవీయమని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా క్షిపణి మోల్డోవన్, రొమేనియన్ గగనతలం గుండా వెళ్లిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా తెలిపారు. “పుతిన్ ఉద్దేశపూర్వకంగా క్రిస్మస్ రోజును దాడికి ఎంచుకున్నాడు” అని జెలెన్స్కీ ఆరోపించారు.
Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.
Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024
రష్యా దాడి అమానవీయం :
ఇంతకంటే అమానవీయం ఏముంటుంది?’’ అని అన్నారు. రష్యా ప్రయోగించిన కనీసం 50 క్షిపణులను, భారీ సంఖ్యలో డ్రోన్‌లను కూల్చివేయడంలో ఉక్రెయిన్ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. రష్యా క్షిపణి, డ్రోన్ల దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రష్యా దాడులతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం.
మరోవైపు ఉక్రేనియన్ దాడుల్లో ఐదుగురు మరణించారని, కాకసస్‌లోని కుర్స్క్, నార్త్ ఒస్సేటియా సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ పడిపోయిందని రష్యా తెలిపింది. రష్యా ప్రయోగించిన 79 క్షిపణుల్లో 58ని తమ వైమానిక దళం కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే, రష్యా ప్రయోగించిన రెండు కొరియన్ KN-23 బాలిస్టిక్ క్షిపణులను అది కూల్చలేదు.
ఉక్రెయిన్‌కు చెందిన (DTEK) ఎనర్జీ కంపెనీ ఈ దాడిలో థర్మల్ పవర్ ప్లాంట్ల పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఉక్రెయిన్ అధికారికంగా రెండోసారి డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. బోరివ్స్కే, కుపియాన్స్క్ ప్రాంతం నుంచి 46 మందిని అధికారులు ఖాళీ చేయించినట్లు ఖార్కివ్ గవర్నర్ ఒలేగ్ సినెగుబోవ్ తెలిపారు.
క్రిస్మస్ రోజు దాడి రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు నగరంలోని బాయిలర్ హౌస్‌లు, థర్మల్ పవర్ ప్లాంట్లు, విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని మేయర్ ఇగోర్ టెరెఖోవ్ తెలిపారు. తాత్కాలికంగా 5లక్షల మందికి విద్యుత్తును నిలిపివేసారు.
Read Also : MS Dhoni Santa Claus : కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు.. శాంతా క్లాజ్‌గా మారిన ఎంఎస్ ధోని.. ఫొటోలు వైరల్!