MS Dhoni Santa Claus : కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు.. శాంతా క్లాజ్‌గా మారిన ఎంఎస్ ధోని.. ఫొటోలు వైరల్!

MS Dhoni Santa Claus : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవా కోసం శాంతా క్లాజ్‌గా మారాడు. కుటుంబం, సన్నిహితులతో కలిసి 2024 క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నాడు.

MS Dhoni Santa Claus : కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు.. శాంతా క్లాజ్‌గా మారిన ఎంఎస్ ధోని.. ఫొటోలు వైరల్!

MS Dhoni turns Santa Claus for wife, daughter

Updated On : December 25, 2024 / 9:17 PM IST

MS Dhoni Santa Claus : డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జీవా కోసం శాంతా క్లాజ్‌గా మారాడు. తన కుటుంబం, స్నేహితులతో క్రిస్మస్ సందర్భంగా చాలా సరదాగా గడిపాడు.

ఈ వేడుకలో ఎంఎస్ ధోనీ స్వయంగా శాంతాక్లాజ్ ‘అవతార్’లో కనిపించాడు. శాంటా గెటప్‌లో తన కూతురు జీవా, భార్య సాక్షి, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నాడు. ధోనీ భార్య సాక్షి బుధవారం (డిసెంబర్ 25) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో క్రిస్మస్ వేడుకల ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలపై ధోనీ అభిమానులు కామెంట్లు, లైకులతో శుభాకాంక్షలను తెలియజేశారు.

శాంటా డ్రెస్‌లో ధోనీ క్రిస్మస్ వేడుకలు :
ధోనీ భార్య సాక్షి మొత్తం 6 ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒక ఫోటోలో, ధోనీ శాంతా మాదిరిగా దుస్తులు ధరించి, ఎల్లో గాగుల్స్ పొడవైన గడ్డంతో ఉన్నాడు. అతని టోపీపై మిస్టర్ మహి అని రాసి ఉంది. ఈ ఫోటోలో ఆయన కూతురు జీవా, భార్య సాక్షి ఉన్నారు. ఈ మూడింటి వెనుక ఒక క్రిస్మస్ చెట్టు కూడా ఉంది. రెండో ఫొటోలో, కుమార్తె జీవా ధోనీని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

వేడుక జరుగుతున్న ప్రదేశంలో అనేక బహుమతులు కూడా ఉంచారు. ధోనీ క్రిస్మస్ చెట్టు దగ్గర కూర్చొని ఫోటోలు కూడా తీశారు. రాంచీలోని రాటు ప్రాంతంలోని సిమాలియా అనే ప్రదేశంలో ధోని తన ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నాడు. బహుశా క్రిస్మస్ వేడుకల కోసం రాంచీ నుంచి బయటకు వెళ్లి సెలబ్రేషన్స్ జరుపుకుని ఉండవచ్చు. ధోనీ కుమార్తె జీవా రాంచీలోని టౌరియన్ వరల్డ్ స్కూల్‌లో చదువుతుంది.

ధోనీ చాలా అరుదుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అయినప్పటికీ, కచ్చితంగా తన కుటుంబం, స్నేహితులతో గడపేందుకు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తాడు. ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఆమె తరచుగా ధోనీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న కెప్టెన్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్‌ను తన సారథ్యంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, ఐపీఎల్ ప్లేయర్‌గా క్రికెటర్‌గా కొనసాగాడు. ఈ ఏడాది కూడా ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది.

Read Also : Jani Master : తెరపైకి మరోసారి జానీ మాస్టర్ కేసు.. మళ్ళీ అరెస్ట్ చేస్తారా?