ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు ఇదే.. 13,000 కేజీల బరువు.. భూమి లోపల 200 అడుగుల లోతుకి దూసుకెళ్లి.. అప్పుడు..

ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులకు అమెరికా మిలిటరీ ఏకంగా ఆరు బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది.

GBU-57 bunker buster bomb

GBU-57 bunker buster: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొద్దిరోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాక్ పై దాడులకు ఇన్నాళ్లు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్ లోని మూడు అణుస్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌ ప్రాంతాల్లో అణుకేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు.

Also Read: శాంతి కావాలా.. విషాదం కావాలా? ఇరాన్ తేల్చుకోవాలి.. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయ్.. ట్రంప్ వార్నింగ్

ఇరాన్ పై దాడులకు అమెరికా సైన్యం ఏకంగా ఆరు బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించినట్లు తెలిపింది. అమెరికా సైన్యం బాంబులు వేసిన మూడు అణు స్థావరాల్లో ఒకటైన ఫోర్డో ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణాన ఉన్న పర్వత ప్రాంతంలో ఉంది. ఈ అణుకేంద్రం భూగర్భంలో బాగా లోతుగా ఉండటంతో అమెరికా మిలిటరీ ఫోర్డోపై బంకర్ బస్టర్ గా పిలిచే బీబీయూ-57 మాసివ్ ఆర్డెనెన్స్ పెనెట్రేటర్ (ఎంఓపీ) బాంబు వేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

 

‘బంకర్ బస్టర్’ చాలా పవర్ ఫుల్..
అమెరికా వైమానిక దళం ప్రకారం.. బంకర్ బస్టర్ గా పిలుచుకునే GBU-57 MOP బోయింగ్ కంపెనీ సహకారంతో అమెరికా అభివృద్ధి చేసింది. ఇది భారీ, అత్యంత శక్తివంతమైన బాంబు. ఈ బంకర్ బస్టర్ దాదాపు 20.5 అడుగుల పొడవు, 31.5 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది దాదాపు 13,000 కిలోల బరువు ఉంటుంది. ఈ బంకర్ బస్టర్ బాంబుకు భూగర్భంలోకి చొచ్చుకెళ్లి అక్కడి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 200 అడుగుల మట్టి.. 60 అడుగుల కాంక్రీటులోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ బాంబు బరువులో సుమారు 80శాతం అత్యంత పటిష్టమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. రెండు టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. అయితే, ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా బీ2- స్పిరిట్ ఫైటర్ బాంబర్లలో అమెరికా మార్పులు చేసింది. ఒక్కో బీ-2 స్పిరిట్ అత్యధికంగా రెండు వరకు బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు.

వైమానిక దళం ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. ఇరాన్ లోని ఫోర్డో సైట్ దాదాపు 90 మీటర్ల లోతులో భూగర్భంలో ఉంది. ఫోర్డో‌లో అమెరికా మిలటరీ చేసిన దాడులు ఎంత నష్టం కలిగించాయనే అంశంపై స్పష్టత లేదు.

GBU-57సాంకేతిక లక్షణాలు
బరువు: సుమారు 13,000 కిలోలు
పొడవు: 20.5 అడుగులు (సుమారు 6.25 మీటర్లు).
పేలుడు పదార్థం: ఇది 5,300 పౌండ్ల (2,400 కిలోలు) పేలుడు పదార్థాలతో నిండి ఉంది.
గైడెన్స్ సిస్టమ్: GPS-ఆధారిత ప్రెసిషన్ గైడెన్స్, ఇది లక్ష్యాన్ని ఖచ్చితమైన ఖచ్చితత్వంతో దాడి చేయడానికి వీలు కల్పిస్తుంది.
క్వారియర్ ఎయిర్ క్రాప్ట్ : ఈ బాంబును బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ మాత్రమే మోయగలదు. ఎందుకంటే ఇది చాలా బరువుగా, పెద్దగా ఉంటుంది. ఇక బీ-3 రెండు జీబీయూ-57 బాంబులను మోయగలదు.
ఇది ఏం చేస్తుంది : లోతైన బంకర్లు, సొరంగాలు, రిన్ఫోర్స్డ్ కాంక్రీట్ నిర్మాణాలను ద్వంసం చేస్తుంది.