శాంతి కావాలా.. విషాదం కావాలా? ఇరాన్ తేల్చుకోవాలి.. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయ్.. ట్రంప్ వార్నింగ్

ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే ..

శాంతి కావాలా.. విషాదం కావాలా? ఇరాన్ తేల్చుకోవాలి.. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయ్.. ట్రంప్ వార్నింగ్

Donald Trump warns Iran

Updated On : June 22, 2025 / 10:20 AM IST

Donald Trump warns Iran: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా మిలిటరీ దాడులుకు పాల్పడింది. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేసింది. ఈ దాడుల తరువాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ క్రమంలో ఇరాన్ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Iran vs Israel war: ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. రంగంలోకి అమెరికా.. ఇరాన్‌ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో భారీ దాడులు.. అనంతరం ట్రంప్ కీలక ప్రకటన

ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది. ఆ దేశంలోని అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు చేశాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్ పైనే ఉంది. ఆ దేశంలో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు.

శాంతి కావాలా.. విషాదం కావాలా..? అనేది ఇరాన్ తేల్చుకోవాలి. పశ్చిమాసియాలో త్వరగా శాంతి నెలకొల్పకపోతే యూఎస్, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తాయి.. ఇరాన్ లోని మిగిలిన లక్ష్యాలన్నింటిని అంతం చేస్తామని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

గత కొన్నిరోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా రగంలోకి దిగింది. అమెరికా మిలిటరీ ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి.. ఆ ప్రాంతాలను ధ్వంసం చేసింది.